Zero No. 1
Editor · Novels

Price: Rs. 135. కొన్ని కథలు చదివినప్పుడు ఇవి జరిగిన ప్రదేశాలు ఎలా ఉండుంటాయో కదా? అనే ఆలోచన కలుగుతుంది. మనకి తెలియని ఊరైనా, రాష్ట్రమైనా, దేశమైనా కేవలం ఆ కథలో జరిగిన విషయాలు, ఉన్న పాత్రలు, ఆడిన మాటలని బట్టి ఆ చోటు ఎలా ఉంటుంది? అని ఊహిస్తూ కూర్చుంటాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇంత అద్భుతమైన కథ ఇలాంటి చాలా మామూలు ప్రదేశంలోనిదా అనీ, ఇంకొన్నిసార్లు ఇంత సాధారణమైన కథ ఇంత అద్భుతమైన చోటులో జరిగుంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి రివర్సులో కొన్ని కట్టడాలను, ఊర్లను చూసి వాటి విశేషాలను గమనించినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన కథ జరిగి ఉండే అవకాశం ఉంది. కదా అనిపించడం మొదలైంది. అలా నేను చూసిన ఒక ప్రదేశం నాకు ఇలాంటి ఆలోచనే కలిగేలా చేసింది. అయితే అలాంటి కథలేవీ అక్కడ జరగలేదని తెలిసాక నేనే నాకు నచ్చినట్టు ఒక కథ రాసాను. ఇప్పుడా ప్రదేశంతో పాటు నాకు ఈ కథ కూడా గుర్తుంటుంది. ఈ కథ చదివాక మీక్కూడా ఏవైనా జరగని కథలు గుర్తొస్తాయేమో చూడండి. నాతో పంచుకోండి. - మొహమ్మద్ గౌస్