Yuddam Shree Prakruthiki Viruddam

Editor · Women

Yuddam Shree Prakruthiki Viruddam book cover

Price: Rs. 90. 1941లో వధువులు కావాలని బంగరు కలలు గన్న బాలికలు ఎలా సైనికులయ్యారో యిందులోని కథనాలు చెప్తాయి. 20వ శతాబ్దిలో సంభవించిన అత్యంత దారుణమైన రెండవ ప్రపంచ యుద్ధంలో 8 లక్షల మందికి పైగా సోవియట్ మహిళలు పురుషులతో సరిదీటుగా పాల్గొన్నారు. స్త్రీలు క్షతగాత్రులను రక్షించి, కట్టుకట్టడమే కాకుండా, కాల్పులు జరిపారు, వంతెనలు పేల్చారు, శత్రువుల అనుపానులు తెలుసుకొనేందుకు వేగు చర్యలు సాగించారు. తమ మాతృదేశం మీద, తమ ఇళ్లమీద, తమ బిడ్డలమీద కనీవినీ ఎరుగని క్రౌర్యంతో దాడిచేసిన శత్రువులను చంపారు. రచయిత్రి యీ పుస్తక రచనకోసం నాలుగేళ్లు అవిరామంగా శ్రమించింది. సూటికి పైగా నగరాలు, పట్టణాలు, పల్లెలు, జనావాసాలు పర్యటించి, యుద్ధంలో పాల్గొన్నవాళ్ల కథనాలు సేకరించింది. అయితే వాటిలో ముఖ్యమైనవి యుద్ధ రంగంలో జరిగిన మటనలు కావు. యుద్ధంలో స్త్రీల గుండెల్ని పిండివేసిన అనుభవాలు. ఈ ప్రత్యక్ష సాక్షుల కథనాల ద్వారా గతం నుంచి వర్తమానం నేర్చుకోవలసిన గుణపాఠాల పైకి, నాటి, నేటి ఫాసిజం పైకీ, యుద్ధాన్ని నివారించవలసిన అవసరం పైకీ పాఠకుల దృష్టి ఆకర్షిప బడింది.

Browse more Telugu books