YSR tho
ఉండవల్లి అరుణ్ కుమార్ / Vundavalli Arun Kumar · Politics

Price: Rs. 95. 20-12-1984 రాత్రి రాజమండ్రిలో అప్పటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ, పి.సి.సి. అధ్యక్షులు శ్రీ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బస చేశారు. ఆ రోజు రాత్రి తీసిన ఫోటో ఇది. ఆ రాత్రే... మర్నాటి నుంచి జరిగే పర్యటనలలో శ్రీ రాజీవ్ గాంధీ ఉపన్యాసాలను శ్రీ వై.యస్. బదులుగా ఉండవల్లి అరుణ్్కుమార్ అనువాదం చేయాలనే నిర్ణయం జరిగింది. అలా ప్రారంభమైన అనువాద ప్రక్రియ మే 21, 1991 విశాఖపట్నంలో రాజీవ్ మరణానికి ముందు జరిగిన సభవరకు కొనసాగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ పార్లమెంటేరియన్, వక్త, వ్యాఖ్యాత, పత్రికా రచయిత. ఆయన రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా, కొంతకాలం జాతీయ కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం వివిధ ప్రజోపయోగ అంశాలపై ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే పనిలో వున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజన చరిత్రను 'విభజన కథ' పేరిట సమగ్ర గ్రంథంగా రూపొందించారు. వీరు న్యాయశాస్త్ర పట్టభద్రులు.