Yodhudu-Saradhi
Editor · Books

Price: Rs. 90. భారతీయ చింతనలో సాటిలేని స్థానమాక్రమించిన భగవద్గీతను భౌతికవాద కోణం నుంచీ పరిశీలించిన రచన ఇది. మతపరమైన, ఆధ్యాత్మికమైన విశ్వాసాలనూ, పురాణాలు ఇతిహాసాలనూ శాస్త్రీయ దృష్టితో అధ్యయనం చేసి రాసింది. దీన్ని రచించిన వి.ఎం. మోహన్ రాజ్ గ్రంధాలయ నిర్వహణలో చిరకాలం కీలక బాధ్యతలు నిర్వహించిన అధ్యయన శీలి. భగవద్గీత నీతిసారం గ్రహించాలంటే దాన్ని ఆవరించివున్న దట్టమైన తాత్విక భాష్యాలను ఛేదించుకుని లోతుల్లోకి చూడాలంటాడు రచయిత. భగవద్గీత శ్లోకాలు సులభమైన అనువాదంతో సహా ఇందులో వున్నాయి.