Yedadugulu
Editor · Novels

Price: Rs. 360. మా విద్యాభ్యాసం 1968-79 అంటే దశాబ్దకాలం యు.జి. పి.జి. కలసి చేశాం. అత్యంత ఆత్మీయ మిత్రులతో మాత్రమే అతని సాన్నిహిత్యం, సాంగత్యం. అపుడపుడు ఆ వయస్సుకు తగ్గ భావ కవిత్వ పోకడలు నాతోపంచుకొనేవాడు. నాకున్న పరిమిత జ్ఞానంతో కొన్ని సవరణలు చేసేవాడిని. మధురమైన భావన తనది. సూపర్ స్పెషాలిటీ శిశు శాస్త్ర వైద్యుడుగా అరుదైన, క్లిష్టమైన ఆపరేషన్లు చేసి పునర్జన్మ ఇచ్చాడనుట. అతిశయోక్తి కాదు. పుట్టుకతో నోట్లో పెద్ద కణితితో జన్మించిన బాలుడికి పుట్టిన నాలుగు గంటలలో విజయవంతంగా ఆపరేషన్ చేశాడు. అది ప్రపంచంలోనే 2వ కేన్సర్ కేసుగా నమోదయింది. ఆపరేషన్ ధియేటర్ లో నిరంతరం బిజీగా ఉండే రాయుడు -అద్భుతమైన ఆలోచనాత్మకమైన ఆచరణాత్మకమైన, ఆధునిక కాలానికి ప్రబోధాత్మకమైన ఎన్నో సన్నివేశాలు, సందర్భోచిత, సంభాషణలు, వైజ్ఞానిక విశేషాలు చదివిన ప్రతివారు తమను తాము ఏదోఒక పాత్రలో జీవించేంతటి సహజత్వం కలిగిన ఇంత పెద్ద నవల రాయడం గొప్ప విషయం. మా రాయుడి జీవనయానంలో నేను కూడా కొంత దూరం ప్రయాణం చేయగలగడం నా అదృష్టం. డా. రాయుడుకున్న కొందరు మిత్రులలో నేను ఒకడైనందుకు గర్విస్తున్నాను. ఇలాంటి రచనలు ఇంకా ఎన్నో చేసి అందరికీ విజ్ఞానాన్ని అందించాలని కోరుతూ...