Yamuna Viplava Kumarulu
Palakodeti Krishnamurthy / పాలకోడేటి కృష్ణమూర్తి · Novels

Price: Rs. 180. 1949 ఫిబ్రవరిలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జననం. ఆంధ్రసరస్వతి బాలికోన్నత పాఠశాల, ఫీల్‌ఖానా, హైదరాబాద్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం. ఆ తరువాత కట్టెల మండిలోని ఆంధ్ర విద్యాలయ ఉన్నత పాఠశాల, దోమలగూడలోని ఆంధ్ర విద్యాలయ హైస్కూల్ (ఎ.వి. కాలేజీ), జాంబాగ్ లోని వివేకవర్ధిని సాయం కళాశాలలో విద్యాభ్యాసం, యూసవ్ూడాలోని వడాల రామారెడ్డి న్యాయ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం) నుండి ఎల్.ఎల్.బి ఉత్తీర్ణత, అవిభక్త ఆంధప్రదేశ్ హైకోర్టులో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పదవీవిరమణ. 1964 నుంచి కథా రచనలు ప్రారంభం. ప్రగతి వారపత్రికలో మొట్టమొదటి కథ 'రిక్షావాలా' వెలువడింది. వివిధ వార మాస పత్రికలలో కథలు, కవితల ప్రచురణ. విపుల, చతుర మాస పత్రికలలో స్వతంత్ర రచనలు, బహు భాషల అనువాద కథల ప్రచురణ. 2007లో స్వీయ కథా సంపుటి 'బంధం' ప్రచురితం. 2014లో 'ప్రతిధ్వని' అనువాద కథా సంపుటి ప్రచురితం. 'కన్నయ్యవాడలో క్రీనీడలు' అనే టైటిల్‌తో తో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ ఇందిరాగోస్వామి అస్సామీ నవల 'నీలకంఠీబ్రజ' అనువాదం జనవరి 2015 చతుర మాస పత్రికలో వెలువడింది. నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ దీనిని పుస్తక రూపంలో తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత రామాయణ సాహిత్యాల స్వరూపాన్ని భారతీయేతర రామాయణ పండితుల ప్రతిభా విశేషాలను రమణీయంగా దర్శింపజేసిన డాక్టర్ ఇందిరాగోస్వామి అస్సామీ నవల 'దాశరథీర్ ఖోజ్' అనువాద నవల 'రామవిహారం' 2016 ఫిబ్రవరిలో వెలువడిది. కామాఖ్యా శక్తి పీఠంలో 1921-32 మధ్యన జరిగిన సంఘటనల ఆధారంగా డాక్టర్ ఇందిరాగోస్వామి రచించిన 'ఛిన్నమస్త' అస్సామీ నవలకు తెలుగు అనువాదం 'ఛిన్నమస్త' నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారి ముద్రణ. కంచ ఐలయ్య ఆంగ్ల నవల 'అన్‌టచబుల్ గాడ్'కు తెలుగు అనువాదం 'అంటరాని దేవుడు' నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అమర్ కాంత్ హిందీ నవల 'లహరే' నవలకు తెలుగు అనువాదం 'కెరటాలు' ఆగస్టు 2019 చతురలో ప్రచురితం. శ్రీ జి.పి. దేశ్ పాండే సంపాదకత్వంలో జ్యోతిరావు పూలే 'ఏరిన రచనలు' గ్రంథంలో ఆంగ్లానికి తెలుగు అనువాదం 'సేద్