Vyavasthanu Kapadina Ramudu
Dr. B. Vijayabharathi / డా. బి. విజయభారతి · Politics

Price: Rs. 135. అధికారం కోసం భూమికోసం చదువుకోసం జరిగిన పోరాటాల చరిత్ర భారతదేశ పురాణ సాహిత్యం నిండా కనిపిస్తుంది. 'మతం ప్రజలను పాలించేది' అన్నారు తిలక్. మతాన్ని ఒక రాజకీయ వ్యవస్థగా ఆయన చూశారు. సమాజాన్ని వర్గాలుగా విడగొట్టి అందులో కొన్ని వర్గాలను ఆధిపత్య కులాలుగా కొన్నివర్గాలను సేవక కులాలుగా స్థిరపరిచే ప్రయత్నంలో మనుధర్మ శాస్త్రానికి లక్ష్యంగా రామాయణ రచన జరిగింది. 'మూర్తీభవించిన ధర్మం రాముడు' అంటున్నది రామాయణం. సంప్రదాయం పేరిట, ధర్మం పేరిట ఎలాంటి వ్యవస్థను రామాయణం ప్రచారం చేసిందో ఈ పరిశీలనలో గమనించవచ్చు. డా॥ విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్, పూలేల జీవిత చరిత్రలు ప్రముఖమైనవి. పురాణాలు-కులవ్యవస్థపైన ఇది నాలుగవ పుస్తకం. మొదటిది సత్యహరిశ్చంద్రుడు, రెండవది దశావతారాలు, మూడవది శట్చక్రవర్తులు.