Vyaktitva Vikasa Parimalalu

Paaniyan Dattasharma / పాణ్యం దత్తశర్మ · Books

Vyaktitva Vikasa Parimalalu book cover

Price: Rs. 70. బ్రహ్మశ్రీ పాణ్యం దత్తశర్మ ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, కాలమిస్ట్, ప్రవచనకర్త, కంపోజర్, గాయకులు, ప్రేరణాత్మక ప్రసంగకర్త. వీరు ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ప్రిన్సిపాల్ గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సుదీర్ఘ సేవలందించారు. వీరివి వందకు పైగా కథలు, 50 సాహిత్య విమర్శనా వ్యాసాలు, 4 నవలలు, ఒక ఖండకావ్యం, ఒక శతకం, ఒక సిద్ధాంత గ్రంథం ప్రచురింపబడి, బహుమతులు పురస్కారాలు అందుకున్నాయి. వీరికి ఎ.జీ, ఆఫీసు, రంజని సాహితీ సంస్థవారు 'కవిసమ్రాట్' విశ్వనాథ పురస్కారాన్ని, సి.పి. బ్రౌన్ సేవాసమితి, బెంగళూరువారు ఎన్.టి.ఆర్. శతజయంతి స్మారక అవార్డును బహూకరించారు. వీరి సిద్ధాంత (పరిశోధక) గ్రంథానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు అవార్డును ఇచ్చారు. 'ఆంధ్రప్రభ' దినపత్రికలో వీరు గత మూడేళ్ళుగా 'దత్తవాక్కు' అన్న శీర్షికన రెంగ్యులర్ కాలమ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ పాయటిక్ ఫోరం వారు వీరికి 'Poet of Profundity అన్న బిరుదునిచ్చి సత్కరించారు. వీరి సైన్స్ ఫిక్షన్ బాలల నవలకు 'తానా' వారి పురస్కారం, మరొక నవలకు డల్లాస్, సిరికోన వారి పురస్కారం లభించాయి. వీరు 'సంగీత ప్రవచనము' అనే కొత్త ప్రక్రియతో ప్రవచనాలు చేస్తుంటారు. భగవద్గీత శాస్త్రీయ విశ్లేషణను ఆంగ్లంలోకి అనువదించగా 'మోతీలాల్ బెనారసీ దాస్ ప్రకాశన్' ఢిల్లీ వారు దీన్ని ప్రచురించారు. 'శ్రీ వీరబ్రహ్మేంద్ర వైభవము' అన్న వీరి పద్య కావ్యాన్ని, ఎ.పి. దేవాదాయ, ధర్మాదాయ శాఖవారు, బ్రహ్మంగారి మఠం వారు సంయుక్తంగా ప్రచురించారు. 'నాహం కర్తా, హరిః కర్తా' అన్న శ్రీ మధ్వాచార్యుల వారి అమృతసూక్తియే ఈ కవికి సదా శిరోధార్యము.

Browse more Telugu books