VOLGA
K.N. Malleeswari / కె.ఎన్. మల్లీశ్వరి · Literature

Price: Rs. 95. 2000 సంవత్సరం తర్వాత మెల్లిగా మొదలైన కొత్త భావజాలం దానికి సంబంధించిన పాత సంప్రదాయాలు, రూపం మార్చుకోకుండానే సమాజంలోకి వస్తున్నాయి. ఇప్పుడైతే ఒక దూకుడుతో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రచయిత్రులకు సమాజాన్ని ముందుండి నడిపించటమనే ఆదర్శం కంటే వెనక్కు పరిగెడుతున్న సమాజాన్ని ఆపటమనేది అత్యవసరమని అర్ధమవుతోంది. ఈ పనిలో విసుగు, విషాదం, వీటిని అధిగమించి, పరిస్థితిని తేలికగా తీసుకోకుండా పట్టుదలగా రాయాలి. రాయటంలో కొత్త మెలకువలు నేర్చుకోవాలి. ఒక్కోసారి ఇది చాలా సున్నితంగా జరగాలి. ఒకోసారి తీవ్ర సంఘర్షణ చేయాలి.