Vo dalita communist jnapakalu

Editor · Best Selling

Vo dalita communist jnapakalu book cover

Price: Rs. 250. ఆర్బి మోరె (1903-1972) తొలుత బాబా సాహెబ్ అంబేద్కర్ ఉద్యమంలోను, తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) లోను నాయకుడు. ఆయన బొంబాయిలో క్షేత్రస్థాయిలో పలు యూనియన్లను నిర్మించిన ట్రేడ్ యూనియన్ నాయకుడు కూడ. మోరె స్వయంగా తన జీవిత చరిత్రను కొంతవరకు చెప్పుకున్నారు. ఆ తర్వాత భాగాన్ని ఆయన కుమారుడు సత్యేంద్ర మోరె పూర్తి చేశారు. ఈ జీవిత చరిత్ర మార్క్సిస్టు విముక్తి వాగ్దానానికి, నిచ్చెనమెట్ల కులవ్యవస్థకు మధ్య సంఘర్షణను వెల్లడిస్తుంది. మోరె రాజకీయ అతివాదం కులవాద రాజకీయాల, అదే విధంగా వామపక్ష రాజకీయాల పరిమితులను ప్రశ్నిస్తుంది. ఆయన రాజకీయాలు కులవ్యవస్థ కాఠిన్యంతోను, వర్గ వైరుధ్యాలతోను నేరుగా తలపడతాయి. అరుదైన ఈ పుస్తకం కుటుంబ చరిత్రను, రాజకీయ ఆలోచనా విధానాన్ని, బొంబాయి నగర నిర్మాణంతో పెనవేసుకున్న పట్టణ కార్మికుల సామాజిక అనుభవాన్ని కలగలిపి అందిస్తుంది. ఈ దళిత కమ్యూనిస్టు స్వీయచరిత్ర/ జీవిత చరిత్ర బొంబాయి చరిత్ర రచనలో కులానికి, వర్గానికి మధ్య వారధి నిర్మిస్తుంది. వర్గ విమోచన కోసం, దళిత విముక్తి కోసం జరిగే ద్విముఖ పోరాటాల మధ్య ఉండే సంబంధాన్ని, అదే విధంగా అవరోధాలను స్పష్టంగా వివరిస్తుంది. దళితునిగా, కమ్యూనిస్టుగా ఉండే వ్యక్తి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అర్థంలో దళితునిగా, కమ్యూనిస్టుగా ఎలా ఉంటాడో ఈ పుస్తకం ప్రతిభావంతంగా తెలియ చేస్తుంది. - గ్యాన్ ప్రకాష్ చరిత్ర ప్రొఫెసర్, ప్రిన్స్టన్ యూనివర్శిటీ నవతెలంగాణ పబ్లిషింగ్ హౌన్

Browse more Telugu books