Vivaham
Editor · Novels

Price: Rs. 100. "తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. +++ “చలంగారి గోత్రంలో పుట్టిన “రవణ” లాంటి పిల్లలు గోపాలరావు లాంటివాడిని అంగీకరించరు. మగవాడు అనదగ్గ మరొకణ్ణి చూచుకొని చక్కాపోతారు. కాని ఇందుకు భిన్నంగా గోపాలరావునే అంటిపెట్టుకొని ఉంటుంది ఆమె. బాల్యవివాహాలలో కొన్ని లోపాలకు తోడు మనసులు అవ్యక్తంగా ప్రేమతో అల్లుకొనటమనే సుగుణం గూడ ఉందని ఈ నవల ప్రదర్శిస్తుంది. అలవాటయిన వివాహవ్యవస్థలాగనే ఈ నవల గూడ హాయిగా పాఠకులను అల్లరిపెట్టకుండ సాగిపోతుంది.”