VISHWASINCHALENI VISHWASAM AATHMADHROHAMEY!
డాక్టర్ దేవరాజు మహారాజు / Dr. Devaraju Maharaju. · Novels

Price: Rs. 108. రాలే ఆకులో, జారే చినుకులో, మండే నిప్పులో, వీచే గాలిలో ప్రతి విషయంలో దాక్కుని ఉన్న అంతస్సూత్రాన్ని అర్థం చేసుకోవడమే - సైన్సు! ప్రాయోగిక ప్రతిజ్ఞానంతో, నిరూపణలతో నిలబడేదే - సైన్సు! తనను తాను పునరుద్ధరించుకునేదే - సైన్సు! అది పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకూడదు. నిత్యజీవితంలో ప్రధాన భాగం కావాలి. మనమిప్పుడు ప్రతి అంశాన్నీ వైజ్ఞానిక దృష్టికోణంలో అవలోకించాల్చి ఉంది. అప్పుడే సహేతుకమైంది ఏదో, అహేతుకమైంది ఏదో గుర్తించగలుగుతాం. దాని వల్ల వేటికి ప్రాధాన్యమివ్వాలో వేటికి ఇవ్వగూడదో అర్థమవుతుంది. కవిగా, సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ ఎనభై ఎనిమిదికి పైగా పుస్తకాలు ప్రకటించిన డాక్టర్ దేవరాజు మహారాజు, ఒక బయాలజీ ఫ్రొఫెసర్గా సమాజంలో వైజ్ఞానిక స్పృహను, మానవవాదాన్ని సామాన్యులకు అందించే దిశలో చాలా చురుకుగా పని చేస్తున్నారు. లోగడ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన 'నేను అంటే ఎవరు?' అనే వీరి పుస్తకానికి 2021 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. నేటి దేశకాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని రాసిన ఈ విశ్లేషణలు జన చైతన్యానికి తప్పక దోహదం చేస్తాయి. పరిశీలనలు, పరిశోధనలు, పరిచయాలు - అనే మూడు విభాగాలుగా సాగిన ఈ వ్యాసాలు విద్యావంతుల్ని తప్పక వివేకవంతుల్ని చేస్తాయి. విశ్వసించలేని విశ్వాసం- ఆత్మద్రోహమే అనే ఈ పుస్తకాన్ని నవచేతన పబ్లిషింగ్ హౌస్ పాఠకులకు తాజా ప్రచురణగా అందిస్తోంది.