Vishwaratha / విశ్వరథ

వేలూరి కృష్ణమూర్తి / Veluri Krishnamurthy · Novels

Vishwaratha / విశ్వరథ book cover

Price: Rs. 180. మన పురాసంస్కృతిని ఆధునిక పరిజ్ఞానంతో అంచనావేసి వాస్తవానికి దగ్గరగా వెళ్ళి ఆ కాలాన్ని అన్నికోణాల్లోంచీ దర్శింపజేయడంలో కన్నడ సాహిత్యానికి పర్వలాంటి గొప్ప నవలలనీ గుళ్ళకాయజ్జిలాంటి నాటకాల్నీ అందించిన చరిత్ర ఉంది. దానికి కొనసాగింపుగా వచ్చిందే ఈ నవల. ఇది గాయత్రీ మంత్రాన్ని ప్రసాదించిన సందర్భాన్ని పరిచయం చేస్తుంది. మనం వెతుక్కుంటున్న సరస్వతీ నాగరికత ఇందులో దర్శనమిస్తుంది. ఇందులోని విశ్వరథుడి జీవితం ఉదాత్తమైనది. రామాయణం గురించి చెబుతూ “సీతాయాః చరితం మహత్" అన్నట్లుగానే ఈ నవల్లోని లోపాముద్ర పాత్ర మహోదాత్తమైనది. ఒక నాగరికత అభివృద్ధి క్రమంలో స్త్రీల పాత్ర ఎంత క్రియాశీలంగా ఉంటుందో తెలుసుకోవడానికైనా లోపాముద్ర పాత్ర చిత్రణాన్ని అధ్యయనం చెయ్యాలి. ఆవిడ గొప్ప ప్రేమమయి. అంతకంటే గొప్ప సామాజిక చైతన్యం కలిగిన వైతాళికగీతం. ఇంక అగస్త్యులవారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నవల్లో త్యాగానికి ఉగ్ర, అంకితభావానికి విశ్వరథ, బలహీనతకు రుక్ష, ప్రతీకారానికి భైరవ, కాలానుగుణమైన మార్పుకి సుదాసు, అచ్చమైన అమాయక ప్రేమకి రోహిణి పాత్రలు ప్రతీకలు. కథని నడుపుకు రావడంలో బెంగళూరు ఎమ్. గోపీనాథ్ చూపిన జాగరూకత విశేషమైనది. మూల రచయిత బెంగళూరు ఎమ్ గోపీనాథ్, అనువాదకుడు వేలూరి కృష్ణమూర్తి గార్లకు అభినందనలు.

Browse more Telugu books