Viplavakaviyogi Veerabrahmam

Editor · Cinima

Viplavakaviyogi Veerabrahmam book cover

Price: Rs. 108. ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మధిర మండలం, మర్లపాడు గ్రామంలో 1956 జూలై 10న జన్మించారు. 1983లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ తెలుగు చదివారు. జానపద విజ్ఞానంలో 'రుంజెలు - ఒక పరిశీలన', 'జానపద విజ్ఞానంలో ఆశ్రిత సాహిత్యం' అనే అంశాల మీద ఎం.ఫిల్, పిహెచ్.డీలు చేశారు. 'దక్షిణ భారత జానపద విజ్ఞానకోశం' నిర్మించారు. 'మల్లన్న కల్ట్' అనే అంశం మీద గొప్ప గ్రంథం రచించారు. 'డైనమిక్స్ ఆఫ్ తెలుగు ఫోక్ లోర్' అనే యుజిసి ప్రాజెక్టు చేశారు. 'ఎల్లమ్మ కల్ట్' ద్రావిడ విశ్వ విద్యాలయంలో చేసిన పరిశోధన, తన పరిశోధనకు గుర్తింపుగా రామరాజు జానపద విజ్ఞాన పురస్కారం వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఈయన కవి కూడా. 'బాడిసె మొక్కబోయింది' అనే కావ్యం ప్రచురించారు. వీరబ్రహ్మంగారి మీద పరిశోధించి మౌలికమైన విమర్శగ్రంథం రచించారు. ఈయన ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేశారు. 20 గ్రంథాలు, 235 పత్రాలు ప్రచురించిన సుబ్బాచారి నిరంతర పరిశోధకులు, ఐదు సార్లు అంతర్జాతీయ వేదికలకు ఆహ్వానంపై వెళ్లారు.

Browse more Telugu books