Viplava Vaidhyulu

Editor · Politics

Viplava Vaidhyulu book cover

Price: Rs. 199. హ్యూగో చావెజ్ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుండి అనేక కుట్రలను, దాడులను ప్రతిఘటిస్తూ వెనిజులా అభ్యుదయ పథంలో అప్రతిహతంగా సాగిపోతున్నది. క్యూబా వైద్య బృందాల సహాయ, సహకారాలతో వెనిజులా ప్రజారోగ్య వ్యవస్థను రూపొందించుకున్న తీరును ఈ పుస్తకం సవివరంగా తెలియ చేస్తుంది. అప్పటివరకు వెనిజులా డాక్టర్లు పట్టణ ప్రాంతాలకు పరిమితమై మాత్రమే పనిచేస్తూ వస్తున్నారు. కాని క్యూబా నుండి వచ్చిన వైద్య బృందాలు గ్రామీణ ప్రాంతాలకు, పేదలు నివసించే ప్రాంతాలకు ఆరోగ్య సేవలను విస్తరింపచేశాయి. ఆ విధమైన కృషిలో పాల్గొనే వెనిజులా వైద్యులను తయారు చేయడానికి క్యూబా వైద్య విశ్వవిద్యాలయాలు, వైద్య ప్రొఫెసర్లు దోహదపడ్డారు. ఈ విషయాలన్నింటినీ రచయిత స్టీవ్ బ్రోవర్ తన ప్రత్యక్ష పరిశీలన ఆధారంగా సవివరంగా తెలియచేస్తారు ఈ పుస్తకంలో. క్యూబా ఒక్క వెనిజులాలలోనే కాదు, తన అంతర్జాతీయ సంఘీభావంలో భాగంగా అనేక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో కూడా ఎలా వైద్య సేవలను అందించిందో ఈ పుస్తకం వివరిస్తుంది.

Browse more Telugu books