Vimukti
Allam Rajaiah · Politics

Price: Rs. 380. తెభాగ, తెలంగాణల నుంచి నక్సల్బరీ, శ్రీకాకుళాల మీదుగా జగిత్యాలలో జైత్రయాత్రగా ఆకృతి దాల్చిన ఒక స్వప్నం ఇవ్వాళ మనముందు ఒక ప్రజాయుద్ధ ఆచరణగా మునుసాగుతున్నది. మంత్రసాని చేతిలోని నూతన శిశువులా. ఆ శిశువు శరీరమంతా ఇప్పుడు మాయకమ్మిన నెత్తుటి తడి. అచ్చం నాగేటిచాళ్లల్లో ఏగిలి చేసిన నేలలో పగులుతున్న విత్తనం నుంచి చిగురిస్తున్న మొక్కవలె. అది మనకు తెలిసిన తెలుగులో అల్లం రాజయ్య తప్ప ఇంకెవ్వరు చెప్పగలరు! అటువంటి భూమికి - మనిషికి ఉన్న సంబంధాన్ని, నేల సంకెళ్లు తెంచుకునే సవ్వడిని, ఒక కుగ్రామపు తండ్లాట గ్లోబల్ సంగ్రామమయ్యే క్రమాన్ని ఒక పసుల కాసే పిలగానిగా పంటచేనులో మంచే మీంచి కూతపెట్టే పంటకాపరిగా అయిదు దశాబ్దాలుగా ఆయన మనకు వినిపిస్తున్నాడు. తన కన్నీళ్లూ నెత్తురుతో తడిసిన గొంతునుంచి. ఇటువంటి బాటకు అడ్డంగా ఉన్న కొండల్ని తొలగించిన ముసలి మూర్ఖుల కథ నేను విలియంహింటన్ ఫ్యాన్లైన్లో చదువుకున్నాను. వరంగలైల్లో 1973లో. మళ్లీ ఆంధ్రప్రదేశ్ అన్ని జైళ్లలో 'విముక్తి' నవలగా చదవుకున్నారు ఎమర్జెన్సీ చీకటిరోజుల్లో రాజకీయఖైదీలందరూ. వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభల్లో అది లక్షలాది మంది రైతాంగ పోరాట కార్యకర్తల చేతుల్లోకి కరదీపికగా వచ్చింది. ఇది ఒక చరిత్రకారుని గడ్డివేళ్ల స్థాయిలోని పోరాటాన్ని క్షేత్రస్థాయిలో సంవత్సరాల తరబడి చేసిన అధ్యయనం మాత్రమే కాదు తన చీమూ నెత్తురుతో, కన్నీళ్లతో, కలల్తో, ప్రజాపోరాటకారుల, ప్రజల కాళ్లల్లో కాళ్లయి నడిచిన కలం సృజన. విలియం హింటన్ ప్రజాచరిత్రకారుడు మాత్రమే. 'భారత్పై అరుణతార' రాసిన యానిమిర్డాల్ ప్రజావిముక్తి దృక్పథమున్న చరిత్రకారుడు మాత్రమే. అల్లం రాజయ్య ఆర్గానిక్ ఇంటలెక్చువల్ మాత్రమే కాదు కొనసాగుతున్న ప్రజాచరిత్ర నిర్మాణ సృజనకారుడు. ఆయన చేతిలో భూమి- మనిషి ఉత్పత్తి సంబంధాల ఘర్షణ లోంచి ఏర్పడే మానవ సంబంధాల లోని అనుభవాలను, అపజయాలను, విజయాలను ఒక నూతన మానవ ఆవిర్భావ ఆవిష్కరణగా మనకు మనుషుల కథగా చెప్తున్నాడు. కాని సారాంశంలో అది భూమీ, మనిషి 'విముక్తి' కథ. సృజనాత్మక కళలతో పోల్చి చెప్పాలంటే అది బోల్షి