Vimuktha

ఓల్గా / volga · Stories & Poetry

Vimuktha book cover

Price: Rs. 95. రూప, అరూపాల అసలు సారాంశాన్ని కనుగొనటానికీ నాతో నేను పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో నాకు సహకరించినది ఈ అనంత ప్రకృతి. ప్రకృతికి రూప, కురూప అనే తేడాలేదని గ్రహించటానికి చాలా కష్టపడ్డాను. అనేక ప్రాణులను గమనించాను. స్తబ్దత, చలనంలలోని ఏక రూపతను గమనించాను. రంగుల రహస్యాలు కనుగొన్నాను. ఈ విషయంలో నాకు గురువెవరూ లేరు. నాకు నేనే సాధన చేశాను. ప్రకృతిలోని ప్రతి అణువునూ శోధించాను. ఆ శోధనలో నా కళ్ళే మారిపోయాయి. నా కంటికి ప్రతిదీ అందంగానే కన్పించింది. నాతో సహా ప్రతిదాన్నీ అసహ్యించుకునే నేను నాతో సహా ప్రతిదాన్నీ ప్రేమించ సాగాను. -సమాగమం నా చుట్టూ ఉన్నవారితో నాకున్న సంబంధంలోని అధికారాన్ని గుర్తించినపుడు నాకు సమస్తం తెలిసిన భావన కలిగింది. సర్వ దుఃఖాలకూ మూలం అధికారమేనక్కా- ఇంకొక చిత్రం తెలుసా? ఈ అధికారాన్ని మనం పొందాలి. ఒదులుకోవాలి. నేను ఎవరి అధికారానికీ లొంగను. నా అధికారంతో ఎవరినీ బంధించను. అపుడు నన్ను నేను విముక్తం చేసుకున్న భావన. నాలో ఇక ఒకే ఆనందం. గొప్ప శాంతి. ఎంతో ప్రేమ, అందరి మీదా జాలి. పాపం ఈ అధికార చట్రాలలో పడి ఎలా నలుగుతున్నారో గదా- విముక్తం అయ్యే దారి తెలియక అశాంతులతో, దుఃఖాలతో, ద్వేషాలతో కుళ్ళిపోతున్నారు గదా- అందరికీ చెబుదామా ఈ శాంతి రహస్యం అనుకున్నాను. - విముక్త

Browse more Telugu books