VIJAYANIKI AARO METTU
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Personality Development

Price: Rs. 290. "వారు నీ భార్య వలువలు విప్పారు. నీ ఇల్లు తగుల బెట్టారు. రాజ్యం నుంచి నిన్ను తరిమి కొట్టారు... లే... పిడికిలి బిగించు. కత్తి తీసుకో... వారిని హతమార్చి నీ పగ తీర్చుకో" అంటూ కృష్ణుడు అర్జునుడి ఆవేశం మీద ఆడుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు. మనిషి యుద్ధం ఎందుకు చెయ్యాలో తార్కికంగా చెప్పాడు. ఎన్నో జీవిత సత్యాల్ని విప్పాడు. కష్టాలకి దుఃఖకారణాలు వివరించాడు. షడ్విధ ఐశ్వర్యాలయిన ధైర్యము, ఆరోగ్యము, కీర్తి, సంపద, ప్రేమ, జ్ఞానములను పొందటం కోసం - ఆధ్యాత్మికత ఆరో మెట్టుగా -భగవద్గీతను ఆధునిక వ్యక్తిత్వ వికాస పరంగా వివరిస్తూ - విజయానికి ఆరో మెట్టు "భగవద్గీతా? ఈపేరు ఎక్కడో విన్నట్టున్నదే” అన్న స్థితినుంచి వచ్చే తరాన్ని పరిరక్షించుకోవటం కోసం.....