Vidhya ranganiki Uri
Editor · Education & Science

Price: Rs. 25. 33 ఏళ్ల తరువాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రూపొందించిన 'జాతీయ విద్యా విధానం ముసాయిదా 2019' గతంలో అమలైన విద్యావిధానం లోని తప్పొప్పులను వరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని ఎవరైనా భావించడం సహజం. కానీ ఈ విధానం విద్యను ప్రయివేటు కార్పొరేట్ల చేతుల్లో పెట్టే విధంగా, కాషాయీకరించే దిశగా అనేక ప్రతిపాదనలు చేసింది. ఒకవైపు విద్యకు నిధులు కేటాయించే బాధ్యతలనుండి ప్రభుత్వం తప్పుకుంటూ మరోవైపు ఉన్నత విద్యలో సృజనను నాశనం చేసేవిధంగా నిరంకుశ అజమాయిషీని చేపట్టాలనుకుంటోంది. అన్నిటికీ మించి ఈ విధానం విద్యపై రాష్ట్రాలకు ఉన్న హక్కులు హరించివేయడం ద్వారా ఫెడరలిజంపై నగ్నంగా దాడిచేస్తోంది. భావి భారతాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించే ఈ 'జాతీయ విద్యా విధానం ముసాయిదా 2019' పై ఒక చర్చను ఈ పుస్తకం ప్రారంభిస్తుందని భావిస్తున్నాం.