Vidhya Prastanamlo Prathyeka Prayogalu
Editor · Education & Science

Price: Rs. 90. ఆధునిక కాలంలో విద్యా బోధన ప్రజాస్వామికంగానూ పిల్లల భాగస్వామాన్ని పెంచేవిధంగానూ వుండాలన్న భావంతో ఏకీభవించని వారుండరు. అలాటి ప్రయోగాత్మక ప్రత్యామ్నాయ విద్యాసంస్థలు నడిపి చక్కటి ఫలితాలు సాధించిన ఉదాహరణలూ వున్నాయి. ప్రత్యామ్నాయ భావాలను తీర్చిదిద్దిన ప్రముఖులూ వున్నారు. అన్నిటినీ మించి బోధనాపద్ధతులకు సంబంధించి ఉపాధ్యాయుల ప్రత్యక్షానుభవాలు కూడా వున్నాయి. ఈ మూడు అంశాలను మేళవింపుగా ప్రస్తుత సంకలనం రూపొందింది.