Vidhvesha Rajakeeyalu
Editor · Politics

Price: Rs. 180. ఈ సంక్లిష్ట సమయంలో సిపిఐ(ఎం) అనంతపురం జిల్లా కార్యదర్శి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి. రాంభూపాల్ నిర్భయంగా, నిస్సంకోచంగా బూర్జువాపార్టీల పాలనావిధానాలను విమర్శిస్తూ నిరంతరం 'ప్రజాశక్తి'లో వ్యాసాలు రాస్తున్నారు. బూర్జువా పార్టీలు పరస్పర దూషణలలో మునిగిపోయిఉంటే, వామపక్షవాది నిర్మాణాత్మక విమర్శ చేస్తున్నారు. ఆయన రాసిన అసంఖ్యాక వ్యాసాల నుండి ఎన్నిక చేసిన 34 వ్యాసాలతో “విద్వేష రాజకీయాలు” పేరున ఈ పుస్తకం ప్రజాశక్తి ద్వారా ప్రచురించారు. 2023 చివర ఎన్నికల సమయం ఆసన్నమౌతున్నప్పటినుండి 2024 ఎన్నికలుపూర్తై, కేంద్రంలో బిజెపి మూడవసారి, రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చేదాకా కొనసాగిన రాజకీయ పరిణామాలను ఈ వ్యాసాలలో విశ్లేషించారు. ఆయన మార్క్సిస్టు నిబద్ధత ప్రతివ్యాసంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. స్పష్టమైన వాదనా పటిమ, అభిప్రాయ నిర్దిష్టత, తార్కిక నైపుణ్యం ఆయన వ్యాసాలలో కనిపించే లక్షణాలు.