Veyipadagalu

Editor · Novels

Veyipadagalu book cover

Price: Rs. 885. ఈ నవల మా నాయనగారు విశ్వనాథ సత్యనారాయణగారు తాను అశువుగా చెపుతూ ఉండగా, మా పినతండ్రిగారు వేంకటేశ్వర్లుగారు వ్రాశారు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావులమీద వ్రాశారు. ఆనాడు ఆంధ్రవిశ్వవిద్యాలయము వారు ప్రకటించిన పోటీకై వ్రాయబడి బహుమతి నందుకుంది. 1937-38లలో ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని 1987-88లలో తిరిగి ఆంధ్ర పత్రికలోనే ధారావాహికగా ప్రచురింపబడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నత పదవుల సధిరోహించిన బహుభాషా కోవిదులు శ్రీ పి.వి. నరసింహారావుగారు, 1968 ప్రాంతాలలో యీ నవలను హిందీభాషలోనికి అనువదించారు. ఆ అనువాదానికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆ అనువాదం ఆధారంగా "సహస్రఫణ్" అనే పేరుతో, 1995 తరువాత దూరదర్శన్ కేంద్రం నుంచి హిందీ మొదలైన అనేక భారతీయ భాషలలో అనేకసార్లు ప్రసారం చేయబడింది. 1976 ప్రాంతాలలో డా. చంద్రకాంత్ మెహతా, ప్రొ. మహేంద్రధవేలచే గుజరాతీభాషలోనికి కూడా అనువదింపబడి, ఆ అనువాదం అప్పటి భారత ప్రధాని అయిన శ్రీమతి ఇందిరిగాంధీగారికి అంకితం చేయబడింది. శ్రీ ఆర్.వి.యస్. సుందరం గారిచే కన్నడభాషలోనికి అనువదింపబడి, 1998 ప్రాంతాలలో "నూతన" అనే కన్నడ పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. ప్రస్తుతం యీ సవలని ఇంగ్లీషులోకి కూడా అనువాదం చేసి ముద్రించాలని ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాము. ఇరువది యొకటన ముద్రణ కాలమునాటికి తెలుగులో లక్ష ప్రతులు పూర్తి అయినవి.

Browse more Telugu books