Vennello Mallika

యద్దనపూడి సులోచనారాణి / Yaddanapudi Sulochana Rani · Novels

Vennello Mallika book cover

Price: Rs. 85. రాత్రి 8 గంటలు అవుతోంది. రోడ్లమీద వాహనాల రద్దీ అప్పుడప్పుడే తగ్గుతోంది. వీధిదీపాలు పొగమంచు వ్యాపించి లో వోల్టేజ్తో మగతనిద్రలా కునుకుదీస్తున్నాయి. సిటీ నడిరోడ్డున వున్న ఆ పెద్ద పార్కు ఇప్పుడిప్పుడే నిద్రకి సర్దుకుంటున్నట్టు సందడి తగ్గి ప్రశాంతత అలుముకుంటోంది. స్కూలు పిల్లలు చాలామంది సాయంత్రం పార్కుకి వచ్చివెళ్ళినట్టు గుర్తుగా ఆటస్థలం దగ్గర చాక్లెట్ల రేపర్లు, బిస్కట్పకెట్ కాగితాలు, ఖాళీ ఐస్క్రీమాప్యాక్ లు విరివిగా పడివున్నాయి. అక్కడున్న బెంచీమీద 12 సం॥ బాలిక ఒద్దికగా ముడుచుకొని పడుకుని, గౌను కాళ్ళక్రిందవరకూ లాక్కుని, పక్కకు వత్తిగిలి చెంపకి చేయి ఆనించుకుని గాఢనిద్రలో వుంది. చెట్టుకొమ్మల సందుల్లోనుంచి విరిజల్లులా పడుతున్న వెన్నెల్లో ఆ పసిముఖంలో అప్పుడప్పుడే అంకురిస్తున్న లేలేత యవ్వనం యీ ప్రపంచంలో ఏ సుందరమైన, అత్యంత నాజూకైన విషయంతో పోల్చలేనట్టుగా, ఈ సృష్టి అద్భుతం ఆ బాలిక గాఢనిద్రలో మూసుకున్న రెప్పలమీద, కొద్దిగా తెరిచిన నోటిమీద రంగరించిపోసినట్టు వుంది. తైలసంస్కారంలేక శ్రద్ధగా దువ్వని జుట్టు, చిరు అలలుగా ఆమె ముఖంమీద రెపరెపలాడుతోంది. ఆమె చేతిలో గట్టిగా గుండెలకి దగ్గరగా పట్టుకునివున్న కోతిబొమ్మ చెక్కది వుంది. ఆమె నిద్రపోతున్న బెంచీదగ్గరే, చిన్న అల్లికబుట్టలో పసిపాపతాగే పాలసీసా, నాప్కిన్ వున్నాయి. ఆ అమ్మాయి పడుకున్న బెంచీకి చాలా దూరంలో ఒక అతను పచ్చికలో వెల్లకిలా పడుకుని, తలక్రింద చేతులుపెట్టుకుని ఆకాశంలోనుంచి కురుస్తున్న వెన్నెలని తదేకంగా, రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతను యవ్వనవంతుడు, స్ఫురద్రూపి. ఆ కళ్ళు చాలా కళగా, చాలా తెలివిగావున్నా, ఆ వెన్నెలని తదేకంగా చూడటంతో ఒక నిస్తేజం కన్పిస్తోంది. అతని ముఖంలో ఏదో బాధ.

Browse more Telugu books