Vemana Padhyalu ( Paris Prati 1730 B.C)

Editor · Stories & Poetry

Vemana Padhyalu ( Paris Prati 1730 B.C) book cover

Price: Rs. 160. పారిస్ ప్రతి 1990లో పుస్తక రూపంలో వచ్చింది. అంటే 30 ఏళ్ళ క్రిందట. అప్పట్లో నా థీసిస్ అమ్మకాలపై వచ్చిన డబ్బుతో నేనే అచ్చు వేసుకున్నాను. ఏడాది లోపే ఆ వెయ్యి ప్రతులు చెల్లిపోయాయి. పారిస్ ప్రతి అనే గ్లామర్ కన్నా దాదాపు మూడు శతాబ్దాల క్రితం ఖండాంతరాలకు వెళ్ళిన అపురూపమైన ప్రతి ఇది. వేమన పద్యాల అతి ప్రాచీన ప్రతుల్లో రెండోది. వేమన పద్యాల పరిష్కరణకూ భవిష్యత్పరిశోధనలకూ తిరుగులేని ఆకర గ్రంథంగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ దృష్టితో ఇది అచ్చయి ఈతరం జిజ్ఞాసువులకు అందుబాటులో ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే నేటి తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేకంగా వేమన సంస్థను స్థాపించి ఒక బృహత్ప్రణాళికను సంకల్పించి అనర్హ రత్నాల్లాంటి వేమన పద్యాలను ఆచంద్రార్కం నిలబెట్టే ప్రయత్నం చేయాలని నా ఆకాంక్ష. -డా. ఎన్. గోపి డా. ఎన్. గోపి వేమన పరిశోధకుల్లో అగ్రగణ్యులు. 'వేమన గోపి' గా ప్రసిద్ధులు. 1980లో వెలువడిన వారి పిహెచ్డ్ పరిశోధక గ్రంథం 'ప్రజా కవి 'వేమన' 6 పునర్ముద్రణలు పొంది, నేటికీ వన్నె తరగని ప్రామాణిక కృషిగా కొనసాగుతున్నది. యివిగాక 'వేమన్న వాదం', 'వ్యాస నవమి' 'వేమన్న వెలుగులు', 'వేమన పద్యాలు (పారిస్ ప్రతి) వంటి గ్రంథాలు వెలువరించారు. గోపి గారు కవితా సంపుటాలను విరివిగా వెలువరించారు. వారు రచించిన 50 పైగా గ్రంథాలలో 25 కవితా సంపుటాలు, 6 విమర్శా వ్యాస సంపుటాలు, 4 పరిశోధక గ్రంథాలు, 6 యాత్రా చరిత్రలు, 6 అనువాద గ్రంథాలు. 2 వ్యాఖ్యానాలు, 3 శీర్షికా ధారావాహికలు, 2 ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, 4 ఇతరాలు ఉన్నాయి.

Browse more Telugu books