Velugulu Ninpe Prathyamnayam( Vamapakshalu, samajika shaktula adwaryalo)

Editor · Politics

Velugulu Ninpe Prathyamnayam( Vamapakshalu, samajika shaktula adwaryalo) book cover

Price: Rs. 30. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయంగా భావిస్తున్న కాంగ్రెస్, బిజెపిలకు పూర్తి భిన్నంగా సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి అజెండాగా సిపిఎం ముందుకొచ్చింది. ఇతర వామపక్షాలతో పాటు, అణచివేతకు, వివక్షకు గురవుతున్న సామాజిక శక్తులను కలుపుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ కృషిలో భాగంగానే చరిత్రాత్మకమైన మహాజనపాదయాత్రను చేపట్టింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో తొమ్మిది మంది బృందం రాష్ట్రమంతటా నాల్గువేల కిలోమీటర్లకు పైగా పర్యటించి నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారిలో ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసింది. దీనికి పరాకాష్టగా హైదరాబాదులో బ్రహ్మాండమైన ప్రజాప్రదర్శన నిర్వహించింది. దీనిలో పలు వామపక్షాలు, సామాజిక శక్తుల నేతలు పాల్గొని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాసంఘాలు, సామాజిక శక్తులతో కూడిన టి మాస్ రూపుదిద్దుకొంది. ఈ శక్తుల సమైక్యత, సమిష్టి కృషి ప్రాతిపదికన ఒక రాజకీయ ఫ్రంటు కూడ ఏర్పడబోతున్నది. ఈ పరిణామాల క్రమాన్ని వివరించే ఎంపిక చేసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

Browse more Telugu books