Veere Periyar
Editor · Politics

Price: Rs. 270. * పురుషులకు వుండే శారీరిక కోరికలు స్త్రీలకు కూడా వుంటాయి. భర్తను కోల్పోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోకుండా ఎందుకుండాలి జీవితాంతం? 60, 70 ఏళ్ళ మగవాడు భార్య మరణిస్తే మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు, స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు? (పేజీ 78). * దేవుడు పరమ శక్తిపరుడు అయినప్పుడు దేవాలయాలకు తలుపులెందుకు? దేవాలయాలపై పిడుగులు పడకుండా నిరోధక సాధనం ఎందుకు? (ລໍ 124) * ఎవరైతే దేవుడ్ని సృష్టించారో వారు తెలివిహీనులు ఎవరైతే దేవుడ్ని ప్రచారం చేస్తున్నారో వారు మోసకారులు ఎవరైతే దేవుడ్ని ఆరాధిస్తున్నారో వారు అనాగరికులు. (పేజీ 128) * జాతకం నిజమే అయితే, అది చెప్పినట్టే అంతా జరుగుతున్నట్లయితే, ఎవరినైనా తప్పు పట్టడం ఎలా? వారి పనులపై వారికి భాద్యత వుండదు. వారు అనుకున్నట్లుగా ఏదీ జరగదు. ఒకతను హత్య చేశాడని శిక్షించటం తప్పు. ఎవరు ఏ తప్పులు చేసినా, నేరాలు చేసినా, హత్యలు చేసినా అది వారి గ్రహాల ప్రభావమే. (పేజీ 166) చదువుతో వచ్చిన జ్ఞానం, ఆత్మగౌరవభావన, హేతుబద్ద ఆలోచన యివే అణగారిన ప్రజల్ని అభివృద్ధి పధంలో నిలిపి వారిని ఉన్నత దశకు చేరుస్తాయి. (పేజీ 276)