Veere Periyar

Editor · History

Veere Periyar book cover

Price: Rs. 270. పురుషులకు వుండే శారీరిక కోరికలు స్త్రీలకు కూడా వుంటాయి. భర్తను కోల్పోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోకుండా ఎందుకుండాలి జీవితాంతం? 60, 70 ఏళ్ళ మగవాడు భార్య మరణిస్తే మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు, స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు? (పేజీ 78). I. దేవుడు పరమ శక్తిపరుడు అయినప్పుడు దేవాలయాలకు తలుపులెందుకు? దేవాలయాలపై పిడుగులు పడకుండా నిరోధక సాధనం ఎందుకు? ( పేజీ124) -ఎవరైతే దేవుడ్ని సృష్టించారో వారు తెలివిహీనులు ఎవరైతే దేవుడ్ని ప్రచారం చేస్తున్నారో వారు మోసకారులు ఎవరైతే దేవుడ్ని ఆరాధిస్తున్నారో వారు అనాగరికులు. (పేజీ 128) - శ్రీ జాతకం నిజమే అయితే, అది చెప్పినట్టే అంతా జరుగుతున్నట్లయితే, ఎవరినైనా తప్పు పట్టడం ఎలా? వారి పనులపై వారికి భాద్యత వుండదు. వారు అనుకున్నట్లుగా ఏదీ జరగదు. ఒకతను హత్య చేశాడని శిక్షించటం తప్పు. ఎవరు ఏ తప్పులు చేసినా, నేరాలు చేసినా, హత్యలు చేసినా అది వారి గ్రహాల ప్రభావమే. (పేజీ 166) -చదువుతో వచ్చిన జ్ఞానం, ఆత్మగౌరవభావన, హేతుబద్ద ఆలోచన యివే అణగారిన ప్రజల్ని అభివృద్ధి పధంలో నిలిపి వారిని ఉన్నత దశకు చేరుస్తాయి. (పేజీ 276)

Browse more Telugu books