Veeratelangana viplavaporatam gunapatalu

Editor · Best Selling

Veeratelangana viplavaporatam gunapatalu book cover

Price: Rs. 490. వీర తెలంగాణా విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కర మూకలనూ ఆ తరువాత నెహ్రూ సైన్యాలను ఎదిరించి ఐదేండ్లపాటు 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గాని, పోరాటంగాని మన దేశ చరిత్రలోనే లేదు. సుందరయ్యగారు రచించిన ఈ గ్రంథం అసలు తెలంగాణా పోరాటపు మొత్తం చరిత్ర. ఏ సామాజిక, రాజకీయ, భౌతిక పరిస్థితుల్లో ఆ పోరాటం పుట్టి పెరిగిందో వివరించి, మారిన పరిస్థితుల రీత్యా దాని ఉపసంహరణ ఎలా అవసరమైనదీ విశదీకరించి, అమూల్యమైన గుణపాఠాలు తీసిన గ్రంథం ఇది. ఆ పోరాటం నడిచిన తీరు, సాధించిన విజయాలూ ఇందు విదితమవుతాయి. అందులో పాల్గొన్నవారు స్త్రీలు పురుషులూ, మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యాల వలె, సామాన్య జనం నుండి జనించి మహావీరులై పోరాడిన గాథలు స్మరణకు స్ఫురణకూ వస్తాయి. కనుక భవిష్యత్ మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవకారులకు శిక్షణ గరిపే పాఠ్యగ్రంథం.

Browse more Telugu books