Veda Rahasyam
వి.శ్రీనివాస చక్రవర్తి / V. SRINIVASA CHAKRAVARTHY · History

Price: Rs. 280. The Secret of the Veda అనే తన కృతిలో శ్రీ అరొబిందో ఋగ్వేదంలోని అధ్యాత్మిక అంతరార్థాన్ని ఆధునిక పాఠకులకి అర్థమయ్యే భాషలో విశదం చేస్తారు. గత ఒకటి రెండు సహస్రాబ్దాలకు చెందిన భారతీయ పండితులు, గత ఒకటి రెండు శతాబ్దాలకి చెందిన పాశ్చాత్య పండితులు వేదాన్ని అన్వయించే ప్రయత్నాలకి పూనుకున్నారు. ఈ ఇరుపక్షాలూ వేదాన్ని బాహ్యార్థపరంగానే, కర్మకాండ పరంగానే వీక్షించారేగాని దాని గూడార్థాన్ని గుర్తించలేకపోయారు అంటారు శ్రీ అరొబిందో, వేదంలో ప్రతి ఒక్కటి ఒక అంతరిక వాస్తవానికి, చలనానికి బాహ్య ప్రతీక. అసలు హెూమం అనేదే యాజ్ఞికుడి అంతర్యంలో జరిగే ఆత్మారోహణకి ప్రతీక. అగ్ని, ఇంద్ర, మిత్ర, వరుణాది దేవతలు అతిచేతనా శక్తులకి ప్రతీకలు. యాజ్ఞికుడి ఆత్మారోహణా యత్నంలో, అతడికి తోడుగా నిలిచి అతడి ప్రయత్నం సఫలమయ్యేలా చూస్తారు. ఈ రకమైన అన్వయాన్ని ఆధారంగా చేసుకుని ఆధునిక పాఠకుడు మళ్లీ ఆ ప్రాచీన గ్రంథ అంతర్యంలోకి తొంగి చూడడానికి వీలవుతుంది. వేదాన్ని వల్లె వేయడంతోనే ఆగిపోకుండా, పాఠకులు వేదసారాన్ని జీర్ణించుకుని సమకాలీన జీవనంపై వేద కాంతులని కురిపించడానికి సాధ్యమవుతుంది. ఈ గ్రంథం తొలిసారి తెలుగులో వెలుగు చూస్తోంది. భావవాద తాత్విక సంప్రదాయంలో అత్యుత్తమ గ్రంథాలలో ఒకటిగా వేద రహస్యం నిలుస్తుంది.