Veda Bhumi
Editor · History

Price: Rs. 15. ఈ పుస్తకంలో.... ఆర్యుల రాకకు పూర్వమే భారత ఉపఖండంలోని వారికంటే వున్నతమైన సాంస్కృతికాభివృద్ధిని సాధించిన ప్రజలు వున్నారు, ఆ సంస్కృతి పతనానంతరం ఆర్యులు సృష్టించిన వైదిక సమాజమూ, సంస్కృతీ ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి? అవి చాతుర్వర్ణంగా ఎలా మార్పు చెందాయి? బానిసలు- యజమానులు వున్న వర్గ తారతమ్యంగల బానిస సమాజం ఎలా రూపొందింది? భారత దేశానికే ప్రత్యేకమైన కుల వ్యవస్థ ఎలా ఉదయించింది. మొదలగు ప్రశ్నలకు సమాధానమిస్తుందీ పుస్తకం. పలు భారతీయ భాషలెలా రూపొందాయి? భారతదేశం విదేశీ దండయాత్రల కెందుకు గురి అయింది? మౌర్య చక్రవర్తుల కాలం నుంచి మొగలాయి చక్రవర్తుల కాలం వరకు పైస్థాయి పాలనా వ్యవస్థలో ఎన్నో మార్పులు జరిగినా క్రిందిస్థాయిలో వున్న గ్రామ స్వావలంబన (లేక) స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ సామాజిక జీవితం మార్పుచెందక ఆంగ్లేయుల రాకతర్వాతే అది ఎందుకు మారింది? వీటన్నింటినీ ఈ పుస్తకంలో వివరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి ఆర్యులు రావడానికి ముందునుండీ, ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వరకూ వున్న దీర్ఘకాల సాంఘిక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తుందీ పుస్తకం.