Vasantha Ganam
Editor · Caste, Religion & Culture

Price: Rs. 270. మార్క్పిస్టు సాహిత్య సిద్ధాంతం పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయని బెంబేలెత్తిపోనవసరం లేదు. ముందు చారిత్రక భౌతికవాదంలోని వైశాల్యాన్ని గమనించాలి. దాని స్థూల మార్గదర్శకత్వంలో చరిత్రలో భాగమైన కళా సాహిత్యాల ప్రత్యేకతలపట్ల శ్రద్ధ పెంచుకోవాలి. సాహిత్యం సృజనాత్మక మానవ కలాపమని, చైతన్యరూపమని, అది నిత్యం అపారమైన వైవిధ్యాన్ని సంతరించుకుంటుందనే స్పష్టత ఉండాలి. విప్లవ సాహిత్య విమర్శకులకు ఇది పుష్కలంగా ఉంది. అందువల్లనే సామాజిక ఉత్పత్తిగా సాహిత్యంలోని దేన్నయినా వివరించగల సిద్ధాంతం కోసం కృషి చేస్తున్నారు. దేనికంటే చలనం అనేక రూపాల్లో ఉంటుంది. వాటన్నిటికీ అత్యున్నత రూపం వర్గపోరాటం. ఈ ఎరుక సాహిత్య సిద్ధాంతానికి తెరచాపలా పని చేస్తున్నది. ఆచరణకు మార్గదర్శి కావడం కంటే సిద్ధాంతానికి వేరే ఉనికి లేదు. ప్రయోజనం లేదు. సమగ్రత దిశగా సాగడమే సరైన, శాస్త్రీయమైన సిద్ధాంతం లక్షణం. ఇది మార్క్సిస్టు సిద్దాంత లక్షణం. మార్క్పిస్టు సాహిత్య సిద్ధాంతానికి కూడా ఈ లక్షణం ఉంది. మన నేల మీద సాహిత్య సిద్ధాంత అవసరాలను తీర్చగలిగే మహత్తర ప్రయత్నానికి ఈ సంకలనం అద్భుతమైన ఉదాహరణ.