VARTHA RACHANA

Editor · Best Selling

VARTHA RACHANA book cover

Price: Rs. 110. సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్ సంపాదకులు కొండుభట్ల రామచంద్రమూర్తి ఖమ్మం జిల్లా తల్లాడలో జిన్మించారు. రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. 1976లో ఆంధ్రప్రభలో కెరీర్ను ప్రారంభించిన రామచంద్రమూర్తి పుష్కరకాలం పాటు ఆ పత్రికకు సేవలందించారు. తర్వాత ఉదయం (1984 95) వార్త (1998-2002) పత్రికలలో వివిధ హోదాలలో పని చేశారు. ఢిల్లీలో ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్ఛార్జిగా కొంతకాలం పని చేశారు. ఆంధ్రజ్యోతి పునఃప్రారంభం ఆయన సంపాదకత్వంలోనే జరిగింది. ఆ పత్రికలో దాదాపు ఆరేళ్లపాటు సంపాదకునిగా ఉన్నారు. ఆ తర్వాత హెచ్ఎంటీవీకి సి.ఇ.ఓగా, హాన్స్ ఇండియాకు సంపాదకునిగా వ్యవహరించారు. ప్రస్తుతం సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన రచించిన క్రీడాభారతం, సరదాల పరదా, కాలమేఘం, వార్తావ్యాఖ్య, అమీబా, విద్యుత్ వలయం, రూరల్ రిపోర్టింగ్ ఇన్ ఇండియా పుస్తకాలు విశేష పాఠకాదరణ పొందాయి. సబ్ ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా పని చేసేవారి కోసం ఆయన చేసిన రచన 'వార్తా రచన' 1993లో ఆ పుస్తకం ప్రచురణ జరిగిన నాటి నుంచి నేటి వరకు పలు ముద్రణలు పొందింది. కేవలం పాత్రికేయులకే గాక, ఇతర రంగాల వారు కూడా తెలుసుకోదగిన అనేకమైన ఆసక్తికరమైన అంశాలతో అధ్యాయాల వారీగా ఉన్న ఈ పుస్తకం పాత్రికేయ వృత్తిలో కెరీర్ ప్రారంభించేవారికి అత్యంత ప్రయోజనకరమైనది, ప్రామాణికమైనదిగా ప్రాచుర్యం పొందింది. అనేక పత్రికల జర్నలిజం కళాశాలలు దీనిని పాఠ్యపుస్తకంగా స్వీకరించడం ముదావహం.

Browse more Telugu books