Varanasi / వారణాసి
Vinod Mamidala / వినోద్ మామిడాల · Novels

Price: Rs. 144. లోకాన్ని, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని, జీవితాన్ని తమదైన అనుభవ కోణంలోంచి చూసే తరం సృజనాత్మక వ్యాసంగంలో ఆర్తి ఉంటుంది. ఆర్ధ్రత ఉంటుంది. మనసులోని మాటలను, అనుభవాల పలవరింతను ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా నిసర్గమైన రీతిన అభివ్యక్తం చేయడం ఈ తరపు యువత ప్రత్యేకత. ఇలాంటి తరానికి చెందిన మిత్రుడు మామిడాల వినోద్. నిండా మూడు పదులు నిండని వయసు తనది. నిండైన ఉత్సాహంతో చరిస్తుంటాడు. నిత్య నూతనంగా చలిస్తుంటాడు. ఏకకాలంలో నాలుగు పనులను చేపట్టి నిర్వహించే సామర్థ్యం అతని సొంతం. మల్టీ టాస్కింగ్ తన పనిలోనూ, బతుకురీతిలోనూ వ్యక్తమవుతూ ఎప్పటి కప్పుడు విస్మయానికి లోను చేస్తుంటుంది. వృత్తిరీత్యా జర్నలిస్టు అయినప్పటికీ తనలో ఒక డిజైనర్, ఫొటోగ్రాఫర్, రచయిత ఉన్నారు. ప్రత్యేకించి కవిత్వం రాయలేదు గానీ కవితా చేలాంచలాల వెంట తిరిగే కవి హృదయం ఉంది. వాక్యాల నడుమ కవితాత్మ కనిపించీ కనిపించనీ రీతిన సూపర్ ఇంపోజ్ అయి దాగుంటుంది. గడిచే ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకోవాలనే తపన అతను చెప్పకనే వ్యక్తమవుతుంటుంది.