Vanarudu Naravatharana
S.Venkatrao · Education & Science

Price: Rs. 75. నిర్జీవం-జీవపరిణామం' అన్న ఈ చిన్న పుస్తకం ఎంతో మౌలికమైన విషయాన్ని మన ముందుంచుతున్నది. అసలు 'జీవం ఎలా ఉద్భవించింది' అన్న వివరణతో ఆరంభమై, యీనాటి వివిధ రకాల జీవుల ఆవిర్భావాన్ని వివరిస్తుంది. ఒక సృష్టికర్త (ఆడా? మగా?) యీ సమస్తాన్ని సృష్టించాడని అన్ని మతాలూ చెప్తూ వస్తున్నదే! ఆ వాదనలో పస లేదని, సృష్టికి మూలం పదార్థమే కాని, అంతకు మించి బ్రహ్మ పదార్థం లేదని తెలియజెప్పడం అంత సులువైన విషయం కాదు. యుగయుగాలుగా “దైవసృష్టి" సిద్ధాంతం రాజ్యమేలింది. కనుక సంప్రదాయకంగా దాన్ని నమ్మినంత త్వరగా హేతుబద్ధమైన నూతన సిద్ధాంతం ప్రజల్లోకి వెళ్ళదు. “ప్రశ్నించే జిజ్ఞాసను పెంచడంలో, హేతుబద్ధమైన ఆలోచనను ప్రోత్సహించడంలో" మన విద్యావిధానం యింతవరకూ కృతకృత్యం కాలేకపోయింది. నేటికీ విద్యావంతులలో కూడా మూఢభక్తి, అంధ విశ్వాసాలు కనపడటానికి అదొక ముఖ్య కారణం. ఈ దశలో ఇలాంటి పుస్తకాలు ఎన్నో వెలువడాలి. వెలువరించడంతోనే సరిపోదు. వాటికి విస్తృత ప్రచారం కూడా ఇవ్వాలి. విద్యార్థి సంఘాలు, అభ్యుదయ కాముకులైన అధ్యాపకులు ఈ పుస్తకాలను గూర్చి ప్రచారం చేయడమే గాదు అవకాశాన్ని బట్టి సామూహికంగా చదివించాలి. ఇలాంటి శాస్త్ర విజ్ఞాన సంబంధమైన పుస్తకాలను అధ్యయనం చేసి, అవకాశం కల్పించుకుని మరీ వివరించాలి. ప్రత్యేకించి విద్యార్థులలో, విద్యాధికులలో ప్రచారం చాలా అవసరం. ఎస్. వెంకట్రావు గతంలో "మహావిశ్వం - మనభూమి" అనే ఒక చిన్న పుస్తకం రాశారు. అలాంటి వానిలో ఇది రెండవది. ఇంకా ఎన్నో ఆయన కలంనుండి రావలసి వుంది. రచయితలో ఈ కర్తవ్యం పట్ల ఆసక్తి, నెరవేర్చగల శక్తి స్పష్టమవుతోంది. ఈ పుస్తకం అభ్యుదయ కాముకులలో, విద్యార్థులలో సహేతుకమైన ఆలోచన రేకెత్తించగలదని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము.