Vanadevatha Theerpu

Editor · Best Selling

Vanadevatha Theerpu book cover

Price: Rs. 180. కొన్నేళ్ల ముందువరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇంట్లోని పిల్లలను ఒడిలో కూర్చుండబెట్టుకొని కమ్మని కథలు, తియ్యని కబుర్లు, ఊహల్లో తేలియాడించే ఊసులను చెప్పేవారు అమ్మమ్మ తాతయ్యలు. ఈ కాలం పిల్లలకు అలాంటి అదృష్టం దక్కలేదు. బండెడు పుస్తకాలను వీపున మోసుకుని బడికి వెళ్ళొచ్చి అలసిపోతున్న బాల్యం నేటి బాలలది. బడి ఈడు పిల్లల అలసట పోగొట్టి హాయిగొలిపే అనుభూతులను అందించడానికి బాధ్యతగా బాల సాహిత్యాన్ని రాస్తున్న మంచి బాల సాహితీవేత్త నారంశెట్టి ఉమామహేశ్వరరావు మామయ్య. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నారంశెట్టి మామయ్య రాసిన విలువైన కథల సమాహారమే 'వనదేవత తీర్పు' బాలల కథల సంపుటి. ఆలస్యం చేయకుండా పుస్తకం కొని చదవండి. చక్కని సందేశంతో, హాయి గొలిపే కథనంతో ఆగకుండా చదివించే కథలను చదివి మానసిక వికాసం పొందండి. నవంబరు 14, 1964 నాడు విజయనగరం జిల్లా గెడ్డలుప్పిలో జన్మించిన నారంశెట్టి మామయ్య 1500కి పైగా రచనలను రాసారు. 30కి పైగా పుస్తకాలను వెలువరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట పురస్కారం, కొలసాని చక్రపాణి పురస్కారం, మంచిపల్లి సత్యవతి పురస్కారం, సమతారావు పురస్కారం మొదలైన పురస్కారాలెన్నో పొందారు. బాలసాహిత్య పరిషత్ గ్రంథాల పోటీలో 'మేలెరిగిన మనిషి'కి ప్రథమ బహుమతి, తానా నవలల పోటీలో 'e-తరం కుర్రాడు నవలకి బహుమతి సహా మరో ఇరవైకి పైగా బహుమతులు వీరి ఖాతాలో ఉన్నాయి.

Browse more Telugu books