VanaaVanaa Vallappaa (Balala geyalu)
Editor · Best Selling

Price: Rs. 30. డాక్టర్ పత్తిపాక మోహన్ కవి, రచయిత, విమర్శకులు, బాల సాహితీవేత్త. పుట్టి పెరిగింది 'మా కళ్ళకు ముత్యాల పేరు' అంటూ డా. సినారె వర్ణించిన మానేరు తీరంలోని నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధీనంలోని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియాలో తెలుగు సంపాదకులుగా ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిగా మిత్రులతో కలిసి నాలుగు కవితా సంకలనాలు తెచ్చారు. 'సముద్రం', 'బంతిపూలు', 'పచ్చబొట్టు' 'కౌముది' 'తెగినపోగు' 'కఫన్', 'గూడూరి సీతారాం కథలు' 'జి. రాములు కథలు' 'నానీలు పీఠికా ప్రస్థానం' 'ఊరి దుఃఖం' వంటి ఇరవై అయిదుకు పైగా పుస్తకాలు వీరి రచన, సంపాదకత్వంలో వెలువడ్డాయి. 'పిల్లల కోసం మనకవులు' 2005, 'చందమామ రావే' 2009, 'వెన్న ముద్దలు’ 2016, 'ఆకుపచ్చని పాట' స్వచ్ఛ సర్వేక్షణ గీతాలు, 'ఒక్కేసి పువ్వేసి చందమామ' బాలల బతుకమ్మ గీతాలు 2018, 'అఆ ఇఈ' బాలల గేయాలు, 'పిల్లల కోసం సినారె కథ' 2019 బాల సాహిత్య రచనలు. 'పిల్లల కోసం మన పాటలు' 2014, "పిల్లల కోసం పొడుపు కథలు' 2017 సంకలనం చేశారు. పిల్లల కోసం ఆంగ్లం, ఇతర భారతీయ భాషలలోంచి పదహారు పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. తెలంగాణా రాష్ట్ర ప్రాథమిక స్థాయి తెలుగు పాఠ్యపుస్తక సంపాదకుల్లో ఒకరు. 1997లో 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి యువ విశిష్ట సాహిత్య పురస్కారం', 2009లో తెలుగు విశ్వవిద్యాలయం 'కీర్తి పురస్కారం', 2011లో 'బాల సాహిత్య పురస్కారం' లభించాయి. 2017లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో 'రాజన్న సిరిసిల్ల జిల్లా సాహిత్య పురస్కారం', 'డా. సన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారం', 'మధురకవి మల్లవరపు జాన్ స్మారక సాహిత్య పురస్కారం', తెలంగాణా సారస్వత పరిషత్ వారి 'డా. తిరుమల శ్రీనివాసాచార్య సాహిత్య పురస్కారం', 'డా. వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం', 2018లో బాల గోకులం వారి 'బాల నేస్తం' పురస్కారం, 'అంగలకుదుటి సుందరాచారి సాహిత్య పురస్కారం', 'డా. చింతోజు బ్రహ్మయ్య-బాలమణి బాల సాహిత్య పురస్కారం' లభించాయి. ఢిల్లీలోని ఆదిలీలా ఫౌండేషన్ ‘వ్యాఖ్