VAMAPAKSHAM BHARATA SWATANTHRYAM
Editor · Politics

Price: Rs. 145. భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజాలు రాసిన ఈ వ్యాసాల సంకలనం స్వాతంత్ర్యోద్యమంలోను, స్వతంత్ర భారతంలోను వామపక్షాల, ప్రత్యేకించి కమ్యూనిస్టుల పాత్రను వివరిస్తుంది. కార్మికులు, కర్షకులు ఇతర కష్టజీవులను కదిలించే విధంగా ఏ దృక్పథంతో దేశ స్వాతంత్య్రం కోసం పనిచేయాలో వివరిస్తూ అందరికన్నా ముందుగా 1921లోనే 'సంపూర్ణ స్వరాజ్య' నినాదమిచ్చింది కమ్యూనిస్టు పార్టీ. మెజారిటీ ప్రజానీకం అయిన కష్టజీవుల ప్రయోజనాలు నెరవేరాలంటే స్వతంత్ర భారతాన్ని సోషలిజం వైపుగా ఎలా నడిపించాలో చెప్పింది కమ్యూనిస్టు పార్టీ. స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ బూర్జువా ప్రజాతంత్ర దృక్పథంలోని పరిమితులను, హిందూ, ముస్లిం మతోన్మాద శక్తుల దృక్పథంలోని ప్రమాదాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆనాడే స్పష్టం చేసింది. ఈ మూడు దృక్పథాల మధ్య సంఘర్షణ స్వాతంత్ర్యోద్యమ కాలంలోను, అనంతరమూ ఎలా కొనసాగుతున్నదో వివరిస్తుంది ఈ గ్రంథం. నేటి ప్రపంచీకరణ వాతావరణంలో అధికారాన్ని కైవసం చేసుకున్న హిందూమతోన్మాద శక్తులు ఒక వైపున కార్పొరేట్ శక్తులతో మిలాఖత్ అవుతూ, మరొక వైపున తమ మతోన్మాద ఎజెండాను ఎలా ముందుకు తీసుకు వెళ్తున్నదీ, ఆ ప్రమాదాన్ని ఎలా నిలువరించాలన్నదీ వివరిస్తుంది ఈ ప్రచురణ.