Vamana Vrukshalu

Dr. N. Mangadevi / డాక్టర్ ఎన్. మంగాదేవి · Books

Vamana Vrukshalu book cover

Price: Rs. 225. ప్రకృతిలోని మహావృక్షాలను దోసిలంత కుండీలో, చారెడంత మట్టిలో, మూరెడంత ఎత్తును మించకుండా ఊడలు, పూలు, కాయలతో వామన రూపంలో తీర్చిదిద్దడమే బోన్సాయి కళ! ఈ సజీవ రూపాలను, విభిన్న శైలీ విన్యాసాలలో పెంచాలని ఎంతో కుతూహల పదుతున్న ఔత్సాహికులను ప్రోత్సహించడం కోసం రూపొందించబడిందే ఈ 'వామన వృక్షాలు'. ఈ గ్రంథ రచయిత్రి డా. ఎన్. మంగాదేవి నాలుగు దశాబ్దాలుగా వివిధ రకాల మొక్కల పెంపకం, పుష్పాలంకరణలతో పాటు, బోన్సాయి కళను జనబాహుళ్యం లోనికి తీసుకువెళ్ళడంలో సఫలీకృతురాలైన వనమాలి. సచిత్రాలతో కూడిన ఆమె వ్యాసాలను ఆంధ్రప్రదేశ్లోని అన్ని పత్రికలు ధారావాహికంగా ప్రచురించాయి. ఆమె రచనల ద్వారా, ఆమె స్థాపించి గత 22 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న 'హరిత ప్రియ' అసోసియేషన్ ద్వారా ప్రభావితమైన వేలకొలది ఔత్సాహికులు తమ ముంగిళ్ళను నందనాలుగా మలచుకున్నారు. వివిధ రకాల మొక్కల పెంపకం గురించి, విద్యా వ్యాసంగాల గురించి ఆమె రచించిన దాదాపు 30 పుస్తకాలను తెలుగు అకాడమీతో పాటు అనేక ప్రముఖ ప్రచురణ సంస్థలు ముద్రించాయి. ప్రముఖ విద్యావేత్తగా, రచయిత్రిగా, సంఘ సేవకురాలిగా ప్రసిద్ధురాలైన డా. మంగాదేవి అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల గ్రహీత. అనాథ బాలల ఆశ్రమం, వృద్ధాశ్రమం, బాల కార్మికుల కోసం, వికలాంగుల కోసం పాఠశాలలు ప్రధానంగా గుంటూరులో ఆమె నిర్వహిస్తున్న “చేతన సంస్థ” ఆమె సేవాతత్పరతకు ప్రతిబింబం.

Browse more Telugu books