Vallankitaalam
Gorati Venkanna · Best Selling

Price: Rs. 310. గోరటి వెంకన్న... ఒక పాటను విసురుతూ ఒక ఆవరణాన్ని అల్లేస్తాడు. మొద్దుబారిన, ఎండిపోయిన నరాల కొసలను తన జీరగొంతుతో నిద్ర లేపుతాడు. ఏమి జరుగుతుందో తెలియదు కానీ, ఒక మహానుభవంలో మనం అలసిపోతాము.... ప్రకృతి విహిత జీవనం, నిర్మల ప్రేమతత్వం, పర్యావరణం, సాధుతత్వం, స్వాదుతత్వం, సామరస్యం, నిస్వార్ధం, ప్రలోభాల విముఖత్వం, తరచు అంతర్ముఖత్వం-ఇవన్నీ గోరటి పాటల్ని సమగ్రం చేశాయి. ఊరు చివరి డొంకదారి కానీ, నల్లతుమ్మ పొదలు కానీ శ్రోతలోని జ్ఞాపకాలను నిద్ర లేపి అబ్బుర పరుస్తాయి. ప్రియురాలి తియ్యటి గొంతును కంచెరేగి తియ్యదనంతో పోల్చి కవి కొత్త అలంకారికతను ఆవిష్కరిస్తాడు. కవిగా ఎంకన్నలో స్థానికత రాజకీయమైనది మాత్రమే కాదు. అది మెట్ట ప్రాంతాల భావుకత. అది బైరాగి సౌందర్యాత్మకత, నిర్ధనుడి దగ్గర ఉన్న హృదయ సంపన్నత....దున్న ఈద్దాసు, కృష్ణశాస్త్రి, జాషువా, గద్దర్ అందరూ కలగలసిన మణిప్రవాళం ఎంకన్న పాట. - కె. శ్రీనివాస్