Vadrevu Chinaveerabhadrudu Kathalu 1980-2023

Vadrevu Chinaveerabhadrudu / వాడ్రేవు చినవీరభద్రుడు · Books

Vadrevu Chinaveerabhadrudu Kathalu 1980-2023 book cover

Price: Rs. 270. వాడ్రేవు చినవీరభద్రుడు 1980 నుంచీ 2023 మధ్యకాలంలో రాసిన 'వాడ్రేవు చినవీరభద్రుడు కథలు, 1980-2023' గా అందిస్తున్నాము. ఈ కథల్లో మూడు దశలు ఉన్నాయి. 1980-1990 మధ్యకాలంలో రాసిన పన్నెండు కథల్నీ చినవీరభద్రుడు ఇంతకుముందు 'ప్రశ్నభూమి' పేరిట కథాసంపుటంగా వెలువరించారు. 1990-2013 మధ్యకాలంలో రాసిన పన్నెండు కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 2013-2023 మధ్యకాలంలో రాసిన పదకొండు కథలు అముద్రితాలు. ఈ మూడు దశల్లోని 35 కథల్నీ కలిపి ఒక సమగ్ర సంపుటంగా ఇప్పుడు వెలువరిస్తున్నాము. ఈ కథల్లో చినవీరభద్రుడి రెండు ప్రపంచాలు, ఆ రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణ ప్రధానంగా కనబడతాయి. ఆయన కవితాత్మక ప్రపంచం ఒకవైపు, సమకాలిక సమస్యలు, రాజ్యం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు మొదలైన అంశాలపట్ల తన జీవితానుభవం ఆధారంగా చేసిన వాస్తవిక పరిశీలన రెండవవైపు ఈ కథల్లో మనం చూడవచ్చు. ఈ సంపుటం తెలుగు కథను సుసంపన్నం చేస్తుందని భావిస్తున్నాం.

Browse more Telugu books