Urikoyya Anchu Nundi

Editor · Politics

Urikoyya Anchu Nundi book cover

Price: Rs. 135. 19యేళ్ళ వయసులో అతను రాజీవ్ గాంధీ హత్యకేసులో అరెస్టుఅయ్యాడు. అతను చేసిందల్లా తొమ్మిది ఓల్టుల బ్యాటరీ కొనడం. హత్యకు ఉపయోగించిన బాంబు తయారుచేయడానికి అది వాడతారని అతనికి తెలిసే ఈ పని చేశాడని నిరూపించే ఏ సాక్ష్యమూ లేదు. హత్య విషయం కేవలం ముగ్గురికే తెలుసని కూడా ప్రాసిక్యూషన్ నిరూపించింది. వాళ్ళు ముగ్గురూ అరెస్టుకాకముందే చనిపోయారు. అయినా అతనికి మరణశిక్ష విధించారు. అతనే ఏ.జి. పేరరివాలన్, మొక్కవోని అతని పోరాటం మూడుదశాబ్దాల పాటు సాగింది. చట్టం ముందు అందరూ సమానం కాదనీ కోర్టులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదనీ అతను ఈ కేసు తీర్పులోని న్యాయమూర్తుల మాటలను ఉటంకించి నిరూపించాడు. చివరికి అతని మరణశిక్ష రద్దయ్యి యావజ్జీవ కారాగారవాసానికి శిక్ష తగ్గింది. ముప్పయ్యేళ్ల తరవాత అతను విడుదలయ్యాడు. కానీ "నిర్దోషి"గా కాదు. అందుకే ఇప్పటికీ తన వాదన ప్రజలముందు ఉంచాలనుకుంటున్నాడు. అతనిపోరాటం న్యాయవ్యవస్థ గురించి వెలికితీసిన విషయాలెన్నో

Browse more Telugu books