URI WARD NUNDI
Editor · Best Selling

Price: Rs. 185. సుధా భరద్వాజ్ కార్మిక సంఘ నాయకురాలిగా మన్ననలు పొందారు. మూడు దశాబ్దాల పాటు ఛత్తీస్ మడ్లో మానవ హక్కుల న్యాయవాదిగా పేద ప్రజలకు, కార్మికులకు సేవలు అందించారు. జన్మతః అమెరికన్ పౌరురాలు అయినా ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకుని మన దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించారు. ఐఐటీ కాన్పూర్ లో గణితంలో మాస్టర్స్ డిగ్రీ చేసి తదనంతరం న్యాయవాద వృత్తి చేపట్టారు. భీమా కోరేగావ్లో హింసను ప్రేరేపించారు అనే కల్పిత అభియోగం మోపి 'ఉపా' కింద 2018 లో సుధా భరద్వాజ్ను అరెస్టు చేశారు. పూణేలోని యరవాడ, ముంబైలోని బైకుల్లా జైలులో మూడేళ్ల పాటు నిర్బంధంలో ఉంచారు. యరవాడ జైల్లో ఉన్న మహిళా ఖైదీల జీవితాలకు సంబంధించిన మానవీయ కథనాలను సుధా భరద్వాజ్ “ఫ్రమ్ ఫాంసీ యార్డ్" పేరిట అక్షరబద్ధం చేశారు. అసహాయులైన మహిళలకు అత్యవసరంగా అందాల్సిన న్యాయ సహాయం అవసరాన్ని, జైళ్లను సంస్కరించాల్సిన ఆవశ్యకతను ఈ పుస్తకం తెలియచెబుతుంది. కె. ఉషారాణి ఇండియన్ బ్యాంక్ ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. కొంత కాలం ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకురాలిగా పనిచేశారు. గమ్యం పేరిట కథా సంపుటి వెలువరించారు. ఇప్పటి వరకు సుభాష్ ఘటాడే (హిందూత్వ పునరాగమనం), ఎ జి నూరాని (ఆర్ ఎస్ ఎస్ దేశానికి ప్రమాదం), రోమిల్లా థాపర్ (అసమ్మతి), మేరీ జోన్స్ ఆత్మకథ 'మరో అమ్మ', టోనీ క్లిఫ్ (వర్గపోరాటం- మహిళా విముక్తి) మహమ్మద్ అమీర్ ఖాన్, నందితా హక్సర్ల (తీవ్రవాది ముద్ర) పుస్తకాలను అనువదించారు. ఆ వరుసలో.. సుధా భరద్వాజ్ రాసిన “ఫ్రమ్ ఫాంసీ యార్డ్” పుస్తక అనువాదాన్ని అందిస్తున్నారు.