Up root Hindutva
Editor · Politics

Price: Rs. 225. లోతైన పరిశీలన, మరింత ఆలోచింప చేసే ఈ పుస్తకాన్ని ఎవరైనా సంతోషంగా ఆహ్వానించాల్సిందే. ఇది ఒక కార్యకర్త ఆలోచనలు. మన సమాజం మీద హిందూత్వ ప్రభావాన్ని తెలిపే ఒక ప్రజా నాయకుడి పుస్తకం ఇది. తిరుమావళవన్ నిజమైన మాస్ లీడర్. విశ్లేషకుడు, దళితులు, స్త్రీలు, సమాజంలోని ఇతర వర్గాల మీద తిరోగమన రాజకీయాల ప్రభావాన్ని అతడు విచారణ చేస్తాడు. - రామ్ పునియాని తొల్. తిరుమావళవన్ తమిళనాడులో దళిత విముక్త పోరాటానికి శక్తిమంతమైన నాయకుడు. విముక్త చిరుతల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ప్రస్తుతం చిదంబరం పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు. ఆయన ప్రసంగాలు తాత్వికత, సిద్ధాంత భావజాలం నిండిన జ్ఞాన భాండాగారాలు, మార్క్స్, పెరియార్ రామసామి, రెవల్యూషనరీ అంబేద్కర్ల మార్గంలో కుల నిర్మూలన పోరాటాన్ని తొల్. తిరుమావళవన్ సామాజిక, రాజకీయ కోణం నుంచి ముందుకు తీసుకు పోతున్నాడు. ఈ పుస్తకం ప్రతీ ఒక్కరూ చదవాలి. -ఎన్.జె.విద్యాసాగర్