Uncle Sam
Malladi Venkata Krishna Murthy · Novels

Price: Rs. 245. అమెరికాకి వలస వెళ్ళిన తెలుగువాళ్ళ రెండో జనరేషన్ పిల్లలు ఎదుర్కొనే ఓ సున్నితమైన సమస్య ఈ నవల ఇతివృత్తం. ఇందులో వలసవెళ్ళే అనేక విధానాలని చర్చించడంతో ఆ ఉద్దేశం గలవారికి ఇది సహాయం చేస్తుంది. ఇది ప్రేమ నవల కూడా. గోల్డెన్ డోర్ అనే పదాలున్న స్టేచ్యూ ఆఫ్ లిబర్టీ కింద కనపడని మరో రెండు పదాలు, డోర్స్ క్లోజ్డ్. ఓ తెలుగు అమ్మాయి తన ప్రియుడి కోసం అమెరికన్ ప్రభుత్వంతో పోరాటం చేసి, ఆ తలుపులని తెరవగలిగింది. ఈ ప్రధానాంశంతో అంకుల్ శామ్ 'తర్వాత ఏమౌతుంది?' అనే ఉత్కంఠతో సాగుతుంది. అమెరికాకి వెళ్ళే వలస విధానాలమీద స్పెషలైజ్ చేసిన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ట్రయాలజీలో ఇది మొదటి నవల. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన మిగిలిన రెండు నవలలు, గగన సీమ, గ్రీన్ కార్డ్ కూడా ఇప్పటికే వెలువడ్డాయి.