Udhyamam-Jeevitham( O Communist Gnapakalu)
Editor · Politics

Price: Rs. 35. తారాజువ్వలు బుస్సుమని ఎగిరి మిరుమిట్లు గొలిపి క్షణంలో మళ్ళీ పతనం అయిపోతాయి. దీపం నిలకడగా నిరంతరం వెలుగునిస్తూనే ఉంటుంది. అలాంటి దీపమే నర్సింహయ్యగారు. కమ్యూనిస్టు నాయకుల జ్ఞాపకాలు చాలానే చదివాను. కాని సాధారణ మూసలో కాకుండా ఈ రచనలో రాజకీయాలు, ఉద్యమాలతో సమానంగా కమ్యూనిస్టు జీవితానికి సంబంధించిన ఇతర పార్శ్వాలను, జీవితంతో ముడివేసుకుపోయిన సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను వివరించడం ప్రత్యేకంగా ఉంది. నర్సింహయ్యగారి జ్ఞాపకాలు నూతన తరానికి ఉత్తేజాన్నివ్వడమే కాకుండా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర రచనకు ఎంతో ఉపకరిస్తాయి.