Udhyamala Shikaram Uddharaju Ramam

Editor · Biographies & Auto Biographies

Udhyamala Shikaram Uddharaju Ramam book cover

Price: Rs. 225. రామం గారు పదవులు, సంపాదన ముఖ్యం కాదనుకున్నారు. కష్టాలు, జైళ్లు, అజ్ఞాతవాసాలు, కుటుంబ ఇబ్బందులు ఎన్ని ఎదురైనా, ఆశయం పట్ల మొదట వలస పాలకుల నుండి దేశ విముక్తి కోసం, తర్వాత దోపిడీదార్ల నుండి శ్రామిక ప్రజల రక్షణ కోసం అకుంఠిత దీక్షతో కృషి చేశారు. త్యాగపూరిత, ఆదర్శమయమైన జీవితాన్ని గడిపారు. ఆయన సౌమ్యత, నిగర్వితనం, నిరాడంబరత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. ప్రజలతో ఉన్నపుడు ఒక అసాధారణ వ్యక్తిత్వంగల గొప్ప నాయకుడు వారిమధ్య ఉన్నాడని కనిపెట్టడం కష్టమయ్యేంతగా మమేకమైన మనిషి రామం గారు. - బి.వి.రాఘవులు ఆయన జిల్లాస్థాయి నుండి అఖిలభారత కిసాన్సభ అధ్యక్షుడి వరకు ఆనేక బాధ్యతలు జయప్రదంగా నిర్వహించారు. నమ్మిన ఆశయాలను జీవన విధానంగా మల్చుకొని త్రికరణశుద్ధిగా అమలుచేసిన అసాధారణ వ్యక్తిత్వం ఆయనది. జీవితంలో ఎదురైన ఆటుపోట్లు. పరీక్షలను ఎదుర్కొని కమ్యూనిస్టుగా 100శాతం మార్కులు సాధించిన ఘనత ఆయనది. ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి, ఏ పనినైనా చేసి చూపించే మనస్తత్వం. ఆయనలోని ఈ సద్గుణమే యువతరానికి స్ఫూర్తినిచ్చింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆనేకమంది కమ్యూనిస్టు యోధులను తయారుచేసి ఎర్రజెండాను సమున్నతంగా నిలిపారు. - వి.శ్రీనివాసరావు

Browse more Telugu books