UDHYAMALA ODILO

Editor · Politics

UDHYAMALA ODILO book cover

Price: Rs. 90. ప్రజలే చరిత్రను నిర్మిస్తారు. ఇది సత్యం. న్యాయం కోసం అన్యాయాన్ని ప్రతిఘటించటం ప్రకృతి సహజం. ఆ ప్రతిఘటన ఉద్యమాలు ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తేవటమూ సహజం. ఇది అందరికీ తెలిసిందే. ఈ ప్రతిఘటన ఉద్యమాలకు కామాలే గాని పుల్ స్టాపులు ఉండవు. ప్రజానీకం మొత్తానికి పూర్తి న్యాయం దక్కే వరకు అవి సాగుతూనే ఉంటాయి. అదీ సహజమే. తరం తర్వాత తరం ఉద్యమాలు నిర్మిస్తూనే ఉంటారు. తమ ముందు తరం నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉంటారు. ఇందుకు ఉదాహరణ మన 'జోయమ్మ'. 'యార్లగడ్డ జోయ' పేరుకు తగ్గ జీవితము - కృషి. 'చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటం' అనే అగ్గి నుండి పుట్టిన నిప్పు రవ్వ జోయమ్మ. తల్లిదండ్రులు, పెదనాన్న చిన్నాన్నలు, పెద్దమ్మ పిన్నమ్మలు, మేనమామ మేనత్తలు అందరూ ఆ జమీందారీ వ్యతిరేక పోరాటంలోనూ, పలనియప్పన్ దుష్కృత్యాలను ఎదురు నిలిచి పోరాడిన సాహసవంతులు. మూఢనమ్మకాలను సమాజానికి చెడు సాంప్రదాయాలను దరికి రానివ్వలేదు. 'జోయ'. నాజీ హిట్లర్ సైన్యాల దురాక్రమణలో ఉన్న సోవియట్ యూనియన్ రక్షణ కోసం అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి, చిత్రహింసలను వరించి 18 ఏళ్ల ప్రాయంలో నేలకొరిగిన వీర యువతి జోయ. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యావత్ ప్రపంచాన్ని ఉద్వేగానికి మరణం. ఎందరో తల్లిదండ్రులు తమ గురిచేసింది జోయ సాహసము కూతుర్లకు జోయ పేరు పెట్టుకున్నారు. యార్లగడ్డ (గుత్తికొండ) జోయ తల్లిదండ్రుల ఆశయాలను, నమ్మకాలని కొనసాగించింది. జోయ పేరును సార్ధకం చేసింది. ఒక సందర్భంలో బృందాకరత్ అంటుంది కదా, 'అజ్ఞాతంగా ఉండిపోయిన కమ్యూనిస్టు మహిళల జీవితం - కృషి గ్రంథస్తం చేయాలీ, అది భావితరాలకు దారి చూపాలీ' అని. చిన్న, పెద్ద అందరూ ప్రేమగా పిలుచుకొనే జోయక్క జీవితం- కృషిని పరిచయం చేసే ఈ చిన్న పుస్తకం అందరూ చదవాల్సిందే.

Browse more Telugu books