Udhaya Veechikalu

Editor · Novels

Udhaya Veechikalu book cover

Price: Rs. 135. 1990 దశకం నుండీ మన సమాజంలో ఆలోచనలు, సిద్ధాంతాలు, విలువలు, ఆదర్శాలు అన్నీ పెనుమార్పులకు లోనయ్యాయి. "అందరికోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి" అన్న స్ఫూర్తిని వెనక్కి నెట్టి ఎవరినీ పట్టించుకోకుండా నేనే, నేనొక్కడినే ముందుకు 'దూసుకెళ్తా' అన్న ధోరణి ముందుకొచ్చింది. నయా ఉదారవాద కాలంలో దిగుమతైన కొత్త టెక్నాలజీ మనముందు మెరిపించిన మెరుపులతో మన సామాజిక దృష్టి బాగా దెబ్బ తింది. వినిమయ తత్వం, పోటీ ప్రపంచం, వ్యక్తివాదం మన మానవత్వ విలువలనే కనుమరుగుచేశాయి. లోకంలో ఉన్న సమస్త సంపదనీ సృష్టించిన, సృష్టిస్తున్న 'శ్రమ' ఈసడించుకోబడుతోంది. మరోపక్క కార్పొరేట్లే సంపద సృష్టికర్తలంటూ పాలకులే కీర్తిస్తున్నారు. మరోపక్క మన భారతదేశపు భిన్నత్వం మీద, దానిని 'ఏకత్వం' గా పెనవేసిన జాతీయోద్యమ స్ఫూర్తి మీద మితవాద, మతతత్వ శక్తుల దాడి పెరిగింది. ఈ పరిస్థితుల్లో మానవ విలువలని తిరిగి సమాజానికి గుర్తు చేసే బాధ్యతను కె.ఎక్స్. రాజు తన వ్యాసాలలో తలకెత్తుకున్నారు. మనిషి చూడవలసిన నిజమైన అందం శ్రమైక జీవన సౌందర్యంలో ఉందని చెప్పారు. సామాజిక అంతరాలు కొనసాగడం అంటే మానవత్వం మృగ్యమైపోవడమేనన్నారు. కుటుంబ విలువలు ఈ వ్యాపార సంస్కృతి కారణంగా దిగజారిపోతున్న వైనాన్ని ఎత్తిచూపారు. భిన్నత్వంలో ఏకత్వం ఎంత గొప్పదో తెలియజెప్పారు. సామ్యవాద ఆదర్శాలను పాఠకులముందుంచారు. కొన్ని సంవత్సరాలపాటు ప్రతీ ఆదివారం ప్రజాశక్తి దిన పత్రికలో కె. ఎక్స్. రాజు రచనలు సంపాదకీయాలుగా వెలువడ్డాయి. వాటిని పాఠకులు ఆస్వాదించారు. ఆహ్వానించారు, ఆదరించారు. వాటిలో కొన్నింటిని ఏరి, కూర్చి మళ్ళీ మీ అందరి ముందుకూ ప్రజాశక్తి బుక్ హౌస్ పుస్తకరూపంలో తెస్తోంది. స్వీకరించండి.

Browse more Telugu books