TYAGALA VAKILLU (Telangana Poru pallela Veera Gadhalu)

Editor · Best Selling

TYAGALA VAKILLU (Telangana Poru pallela Veera Gadhalu) book cover

Price: Rs. 140. రచయిత, కవి అనంగారి భాస్కర్ సమతాలోక స్వాప్నికుడై.. హృదయ సంస్కారంతో చేసిన చక్కని ప్రయత్నం ఈ రచన. వ్యక్తి కేంద్రంగా అన్ని రంగాలను చుట్టుముడుతున్న అపసవ్యపు కాలంలో... ఒక యువ రచయిత ఇలా.. ఈ నేల త్యాగాన్ని మననం చేసుకుంటున్నందుకు, మనల్ని మళ్లీ.. "త్యాగాల వాకిళ్లలోకి" తీసుకెళుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. -గోరటి వెంకన్న , ప్రజాకవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సరళ శైలితో, ఉత్తేజం కలిగించే పదునైన నుడికారాలతో, బలమైన వ్యక్తీకరణలతో కూడిన ఈ వ్యాసాలు చదువుతుంటే.. కన్నీళ్లు తెప్పిస్తాయి.. గగుర్పాటు కలిగిస్తాయి... రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.. ఆలోచింపజేస్తాయి.. ఆదర్శాన్ని నూరిపోస్తాయి.. వర్తమాన సమాజంలో మన బాధ్యతను గుర్తుచేస్తాయి.. యువతరం ఈ పుస్తకాన్ని చదివి ఇందులోని స్ఫూర్తిని అర్థం చేసుకుంటే ఎవరిలోనైనా మానవీయత అంకురిస్తుంది. - ఎం. నాగేశ్వరరావు , ఈటీవీ ఎడిటర్ అది చరిత్ర చెలరేగిన కాలం. ప్రపంచపటం మీద పోరుదేశంగా తెలంగాణ నిలబడిన కాలం. నవాబులు దొరలూ వారి జీహుజూర్లూ పల్లెలగుండెలు చీల్చి నెత్తురు తాగుతున్న పీడాకాలం. సహనం చచ్చి, చైతన్యం పుట్టి, ఊరూరూ ఉద్యమమై ఉరకలు వేసిన వైభవోజ్వల మహాకాలం. అణువణువూ రణరంగమే అయినా, కొన్ని ఊర్లు, కొన్ని పేర్లు ప్రజాపరాక్రమాలకు ప్రేరణలయ్యాయి. అసంగారి భాస్కర్ వాటిని అక్షరాలలో స్మరించారు. చరిత్రను కూడా చెరబట్టి, తెలంగాణ వీరగాథను వక్రీకరించే విషప్రయత్నాలు జరిగే వేళ.. భాస్కర్ ఈ త్యాగాల వాకిళ్లలోకి నడిపించి, అసత్యాల నుంచి మనలను కాపాడుతున్నారు. - కె. శ్రీనివాస్ , ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎంత గోడు, ఎంత గోస ప్రతి ఊరు ఒక జలియన్ వాలా బాగ్, సువర్ణాక్షరాలతో లికించాల్సిన చరిత్రకు ప్రపంచం ప్రేరణ పొందాల్సిన పోరాటానికి ఆనవాళ్లు లేకుండాచేసి, పాతాళంలో పూడ్చి శాశ్వత సమాధి కడితే.. సమాధిని బద్దలుకొట్టిన కలం, విశ్వం విస్తుపోయే వాస్తవాలను వెలికితీసే అస్త్రం ఈ పుస్తకం. చరిత్రకు వక్రభాష్యాలు చెప్పుకు తిరిగే పిరికిపందలకు, ఈ తరం రజాకార్లకు కచ్చితంగా చెంప చరిచి చదివించాల్సిన పుస్తకం

Browse more Telugu books