Turning point
Dr. B.V. Pattabhiram · Personality Development

Price: Rs. 120. మానవుడు అద్భుతాలెన్నో సృష్టించాడు. బండి చక్రం నుండి బాంబుదాకా కనిపెట్టాడు. కానీ అంతకన్నా మరో అద్భుతం మానవుడి వద్ద ఉంది. అదే శక్తిమంతమైన ఆలోచన. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలిగితే ఇంకా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు. మనం చేసే పనుల్లోని జయాపజయాలు, ప్రయోగం లోని ప్రక్రియలు మాత్రమే. అవే అంతిమం కాదు. ఫెయిలయ్యామని అక్కడే ఆగిపోయేవాడు పిరికివాడు. ఈ ఫెయిల్యూరు అనేది మళ్ళీ సమర్థంగా పని చెయ్యటానికి వచ్చే అవకాశం మాత్రమే అనుకుని మళ్ళీ ప్రయత్నించే వాడు ధైర్యవంతుడు, కార్యదీక్ష కలవాడు. మనం ఒక లక్ష్యాన్ని తలపెట్టినపుడు మధ్యలో ఆటంకాలు వస్తాయనేది వాస్తవం. వాటికి సిద్ధపడే పని చేయాలి.